తెలుగు సినిమా ప్రపంచంలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువహీరో విశ్వక్ సేన్. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నకథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. ‘గామి’పేరుతో తీస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అందులోనూ అఘోరాగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలైంది. అందులో విశ్వక్ కనిపించపోయినప్పటికీ ఆ చిత్ర గ్లింప్స్ చాలా ఆసక్తితో ఆకట్టుకుంది. అత్యున్నత టెక్నికల్ వాల్యూష్ ఇందులో కనిపించాయి. కాగా ఈ గ్లింప్స్ చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ ను ప్రశంసించారు.
‘గామి టైటిల్ ను ప్రకటించారు. నేను మొత్తం చిత్రబృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. టీమ్ లో చాలా మంది కొత్తవారు, యువకులే ఉన్నారు. యువ నిర్మాతలు పెరగడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను.’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే గామి టీజర్ పోస్టు చేసి ‘ఎప్పటికప్పుడు కొత్తదనానికి ప్రయత్నిస్తున్న యూవీ క్రియేషన్స్ వారికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా తెలుగమ్మాయి చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి పెద్దగా వివరాలు బయటికి రాలేదు. విశ్వక్ ఫస్ట్ లుక్ కూడా ఇంకా చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. అఘోరాగా విశ్వక్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి