హైదరాబాద్‌లో ఓ శాడిస్ట్ యువకుడు తన ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. తన ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో ఏకంగా ఆమెను ఓ కేసులో ఇరికించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. చివరికి అసలు విషయం తెలిసిన పోలీసులు ఆ యువకుడ్ని వెతికి పట్టుకున్న పోలీసులు కటకటాల పాలు చేశారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా ప్రస్తుతం నిందితుణ్ని అరెస్టు చేశారు. సికింద్రాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.


తన ప్రేమను నిరాకరించిందని యువతికి గంజాయి ప్యాకెట్‌ గిఫ్ట్ రూపంలో ఇచ్చి యువకుడు ఆమెను ఇరికించాలని చూశాడు. సికింద్రాబాద్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన వినయ్‌ కుమార్‌ అనే 25 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని ఆమెతో చెప్పాడు. దీంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపం పట్టలేని అతను అక్కసుతో ఆమెపై కక్ష తీర్చుకోవాలని ఓ కుట్ర చేశాడు. ఇవెంట్ ఆర్గనైజర్ అయిన యువతి ఓ పనిపై 2018 మే 31న మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి శిర్డీసాయి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఇది తెలుసుకుని వచ్చిన అతడు.. తన ప్రేమను అంగీకరించలేదు కాబట్టి., తన స్నేహానికి గుర్తుగా గిఫ్ట్‌ ఇస్తున్నానంటూ నమ్మించి కనిపించకుండా ప్యాకింగ్ చేసిన 3 కిలోల గంజాయి ప్యాకెట్‌ చేతికి అందించాడు. మరుసటిరోజు రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. 


Also Read:  '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!


అయితే, అప్పటికే ఆ యువతి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లుగా జీఆర్పీ పోలీసులకు యువకుడు సమాచారం అందించాడు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాగానే పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడినని చెప్పి గిఫ్ట్‌ ప్యాక్ చేసిన ఓ ప్యాకెట్‌ను ఇచ్చి తనను మోసం చేసినట్లుగా యువతి పోలీసులకు వివరించింది. పోలీసులు విచారణలో అదే నిర్ధారణ కావడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాలతో ఆ యువతిని అప్పుడే విడిచిపెట్టారు.


Also Read: అన్ని నగరాల్లో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..


అదే రోజు నిందితుడు వినయ్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా పోలీసులకు దొరక్కుండా అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అనంతరం నిందితుడి ఆచూకీ లభ్యం కావడంతో అతనికి ఫోన్ చేసిన జీఆర్పీ పోలీసులు.. కేసు లాంటిదేమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సి ఉందని పిలవగా.. గురువారం స్టేషన్‌కు వెళ్లాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్‌ ప్యాక్ చేసి ఇచ్చినది తానేనని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.


Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి