వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల ఘనత సాధించిన సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు.​ దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.






ఎలా ఉందంటే?









"మనం ఎక్కడా ఆగం..


ఎక్కడా ఆగిపోము..


శత్రువు ఎవరైనా మనం తలవంచం..


విరోధికి ఆయుధాలున్నా..


శతకోటి కవచాలతో మనం ఎదుర్కొంటాం.."


ఇలా సాగిపోయిన పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. వ్యాక్సినేషన్‌లో దేశం సాధించిన ప్రగతికి ఈ గీతం అద్దం పడుతోంది. కరోనాపై యుద్ధం కోసం టీకా తయారీ దగ్గర నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్ అందించడం కోసం ఆరోగ్య సిబ్బింది పడిన శ్రమ వరకు ఈ గీతంలో చూపించారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్ ఈ పాటను ఆలపించారు.


Also Read: SRK Meets Aryan Khan: ముంబయి జైలుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్!


Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'


Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి