దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్‌తో పాటు మరో నలుగురిపై పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదైంది. 16 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపుల చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు.


రోహిత్ దామోదరన్ శంకర్ కుమార్తె ఐశ్వర్యను ఈ ఏడాది జూన్‌లో చెన్నైలో వివాహం చేసుకున్నాడు. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌కు శంకర్ త‌న పెద్ద కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త.  మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్ కు  స్పాన్సర్ గాను ఉన్నాడు.


క్రికెట్ క్లబ్ లో రోహిత్ సెక్రటరీగా ఉన్నాడు. అయితే క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు.. తనను లైంగికంగా వేధించారని.. 16 ఏళ్ల అమ్మాయి పుదుచ్చేరిలోని మెట్టుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అధికారులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్టు..బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి లేఖ రాసింది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు మెట్టుపాళ్యం పోలీసులు తమరైకన్నన్, జయకుమార్, దామోదరన్, రోహిత్ దామోదరన్, వెంక అనే ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


ఇక దర్శకుడు శంకర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తెలుగులో రామ్ చరణ్‌తో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుంది.  


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట. ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.


Also Read: Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..


Also Read: TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ


Also Read: Chandrababu: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు


Also Read: చాక్లెట్ ఇస్తానంటే సరే అంకూల్ అంటూ నమ్మి వెళ్లింది నాలుగేళ్ల పాప.. పక్కకు తీసుకెళ్లిన అతడు.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి