నాలుగేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. అక్కడికో వ్యక్తి వచ్చాడు. పాపకు చాక్లెట్ ఆశ చూపాడు. నిజంగానే ఇస్తాడనుకుని వెళ్లింది అభం శుభం తెలియని చిన్నారి. ఇక తన రక్షసత్వాన్ని చూపించాడు ఆ వ్యక్తి. పాపపై లైంగిక దాడి చేశాడు. ఆ పాపకు ఏం జరుగుతుందో తెలియలేదు. మళ్లీ తీసుకొచ్చి.. స్నేహితులు ఆడుకుంటున్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తల్లికి తెలిసి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది.


హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కాంతు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లి.. చి‌న్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి.. కామాంధుడిని ప్రశ్నించింది. ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్‌లో ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా గాంజా మత్తులో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


కొన్ని రోజుల క్రితం సైదాబాద్‌  బస్తిలో నివాసం ఉండే ఆరేళ్ల చిన్నారీకి చాక్లెట్ ఆశ చూపి తన గదికి తీసుకువెళ్లిన రాజు అనే వ్యక్తి హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. హత్య చేసి తన గదిలోనే తాళం వేసి బయటకు వచ్చాడు. అయితే ఇదే అంశంపై పోలీసులకు చెప్పినా.. పట్టించుకోలేదని స్థానికులు అప్పుడు చెప్పారు. సకాలంలో స్పందించక పోవడంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పోలీసులు వెతుకున్న సమయంలో సంఘటన అనంతరం నిందితుడు పారిపోయేందుకు అత్యాచారం జరిగిన బస్తీలోనే అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ టైమ్ లో నిందితుడు రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఎక్కడ ఉన్నాడనే ఆచూకి లభించడం కష్టమైంది. ఈ క్రమంలోనే నిందితుడిని పట్టించిన వాళ్లకి 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది పోలీస్ డిపార్ట్ మెంట్. అయితే నిందితుడు రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.


Also Read: Actress Molested: విమానంలో నటి నడుంపట్టుకుని ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త.. పురుషుడు అనుకున్నాడట..


Also Read: TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ


Also Read: Chandrababu: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి