ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా రుణాలు పొందుతున్న వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన అసలు పత్రాను తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. 


గవర్నర్ పేరు చేర్చిన అంశంపై స్పందిస్తూ.. రూ.25 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆస్తులు తనఖా పెట్టి... అనంతరం తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలం చెందితే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేయడం, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని ధర్మాసనం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది. అంతేకాక, ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీ ఎస్డీసీకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారని ప్రశ్నించింది.


Also Read: ఉపఎన్నిక పొరుగు జిల్లాల్లో రాజకీయ కార్యకలాపాలు వద్దు... కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల


ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జయ చేయకుండా నేరుగా ఎస్‌డీసీ‌కి జమ చేస్తున్నామనే వాదనలో నిజం లేదని ఏజీ ధర్మాసనానికి వివరించారు. ఎస్‌డీసీ ఏర్పాటు రాజ్యాంగ, చట్ట విరుద్ధం కాదని కేవలం పిటిషనర్‌ రాజకీయ దురుద్దేశాలతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఏజీ వివరించారు. పిటిషనర్లు టీడీపీ వ్యక్తులని, రాజకీయ విమర్శల కోసమే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని వివరించారు. కాబట్టి పిల్‌ను కొట్టివేయాలని కోరారు.


Also Read: Weather Updates: ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో పొడిగా వాతావరణం.. రాగల 5 రోజుల్లో ఇలా..


వాదనల్లో భాగంగా.. ప్రభుత్వం వేర్వేరు మార్గాల ద్వారా తెచ్చుకుంటున్న రూ.లక్షల కోట్ల అప్పులకు సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున గ్యారెంటీ పత్రాలపై ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారే ఈ సంతకాలు పెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్ల రుణానికి కూడా ఈయనే సంతకం పెట్టారు. ఇప్పుడేమో ఆ రుణానికి, గవర్నర్‌కూ సంబంధం లేదని హైకోర్టులో ఏజీ చెప్పారు. అలాంటప్పుడు బ్యాంకులు ఆ అప్పులను ఎవరిని అడగాలంటూ ధర్మాసనం అడిగింది.


Also Read: Hyderabad: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువకుడు, చివరికి జైలు పాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి