దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. బై ఎలక్షన్ జరిగి నియోజకవర్గంతో పాటు పక్క జిల్లాలు, ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాల సమీపంలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్, కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.


Also Read: డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్


ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ


ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలో ఎంసీసీ, కొవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఈసీ తెలిపింది. కేవలం అభివృద్ధి, పాలనాపరమైన కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా మొత్తం కాకుండా నియోజవర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. జిల్లాలో నియోజకవర్గం వెలుపల రాజకీయ కార్యకలాపాలు కొనసాగడం ఈ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ అమల్లో ఉందని పేర్కొంది. దీనిపై జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.


Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !


గతంలో ఈసీ ఏంచెప్పిందంటే...


ఓటర్లు కరోనా బారిన పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నియమాలను తీసుకొచ్చింది. పశ్చిమ బంగా, తమిళనాడు ఎన్నికల సమయంలో జరిగిన లోపాలను సవరిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అమలు చేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు సమావేశాలను నిర్వహించడంతో విమర్శలకు తావిస్తోంది. సభలు, సమావేశాలకు జనం పెద్ద సంఖ్యలో గుమికూడదనే ఉద్దేశంతో ఈ నియమాలను రూపొందించినట్లు ఈసీ తెలిపింది.  ఈ నిబంధనలు అమలు చేసి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అని చూస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా నియోజక వర్గ సరిహద్దులో పెంచికలపేటలో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 


కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్        


కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని  పగడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. అందరు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో లక్ష రూపాయల నగదు కంటే ఎక్కువ తీసుకెళ్లేవారు నగదుని రసీదు లేకుండా తీసుకెళ్లకూడదని తెలిపారు. 


Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి