Coronavirus Cases AP: ఏపీలో నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 41 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 493 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,59,408కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ 14,327 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 






అదొక్కటే ఊరట..
ఏపీలో నిన్న ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 59 వేల 408 మంది కరోనా బారిన పడగా, అందులో 20,39,581 మంది కొవిడ్19 నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. బుధవారం నాడు 552 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,500 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం 2,91,42,162 (2 కోట్ల 91 లక్షల 42 వేల 162) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 41,820 శాంపిల్స్‌ పరీక్షలు చేశారు.


Also Read: రోజుకు ఓ నాలుగు వాల్నట్స్ తిన్నా చాలు... జ్ఞాపకశక్తి పెరుగుతుంది


 






కరోనాపై యుద్ధంలో భారత్ భేష్..
కరోనాపై పోరాటంలో భారత్ సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారత్ నవచరిత్ర లిఖించిందన్నారు మోదీ. భారత్ సాధించిన అరుదైన మైలురాయిగా గుర్తుగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఎర్రకోట వద్ద ఓ గీతాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ జరిగిందని, కరోనాపై పోరులో భారత్ దాదాపుగా విజయాన్ని సాధించిందన్నారు.


Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం 


Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి