ABP  WhatsApp

Kerala High Court: 'నీ కూతురికి ఎవరితోనో సంబంధం ఉంటే.. నువ్యు రేప్ చేసేస్తావా?'

ABP Desam Updated at: 21 Oct 2021 04:53 PM (IST)
Edited By: Murali Krishna

సొంత కూతుర్నే అత్యాచారం చేసిన ఓ తండ్రి కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

NEXT PREV

ఓ అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితురాలికి అంతకుముందు ఏమైనా సంబంధాలున్నా దోషిని శిక్షించే సమయంలో అవి న్యాయస్థానం పరిగణించదని వ్యాఖ్యానించింది. తన 16 ఏళ్ళ కూతురిపై తరుచుగా అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రి కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


కీలక వ్యాఖ్యలు..



అత్యాచారం కేసులో బాధితురాలి వ్యక్తిత్వం గురించి కోర్టు ఆలోచించదు. ఆమెకు ఇంతకుముందు ఎవరితోనైనా లైంగిక సంబంధాలున్నప్పటికీ అవి ఈ కేసులో అనవసరమైన విషయాలు. కూతుర్ని రక్షించాల్సింది పోయి మానభంగం చేయడమే కాకుండా ఆమె వ్యక్తిత్వంపై కూడా ఆరోపణలు చేస్తున్నాడు తన తండ్రి. ఇది చాలా హేయమైన చర్య. ఇక్కడ మా పని నిందితుడు తప్పు చేశాడా లేదా అని చూడటమే.. కానీ బాధితురాలి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం కాదు.                                                     -  కేరళ హైకోర్టు 


ఏం జరిగింది?


కేరళలోని ఓ వ్యక్తి తన సొంత కూతురిపై తరుచుగా అత్యాచారం చేసి చివరకి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీనికి కారణం తన తండ్రేనని ఆ బాలిక అమ్మకు చెప్పింది. తర్వాత బంధువుల సాయంతో పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 


అయితే కోర్టులో ఆ బాలిక తండ్రి చేసిన ఆరోపణలను విని న్యాయమూర్తులే షాకయ్యారు. తన కూతురికి ఇంతకంటే ముందే చాలా మందితో లైంగిక సంబంధం ఉందని ఆ తండ్రి కోర్టులో వాదించాడు. ఈ వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపాడాల్సిన స్థానంలో ఉండి ఇలాంటి నీచమైన పని చేయడం మొదటి తప్పని.. మళ్లీ ఆ తప్పుని ఇలా అసత్యాలతో వెనకేసుకురావడం మరో తప్పని కోర్టు చివాట్లు పెట్టింది.


డీఎన్ఏ ఆధారంగా  తన కూతురి గర్భానికి తండ్రే కారణమని తేలడంతో నిందితుడ్ని దోషిగా కోర్టు గుర్తించింది. కొన్ని సందర్భాల్లో భయంతోనో, కుటుంబ గౌరవం గురించో ఆలోచించి ఇలాంటి అత్యాచార విషయాలు కోర్టుల వరకు రావడం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కాస్త ఆలస్యం అయినా కోర్టు వాటిని తప్పుగా పరిగణించడం లేదని అభిప్రాయపడింది.


Also Read: SRK Meets Aryan Khan: ముంబయి జైలుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్!


Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'


Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 21 Oct 2021 04:50 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.