రామ్ గోపాల్ వర్మకు రాజకీయాలంటే చాలా ఆసక్తి . ఆయన ప్రతి రోజూ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటారు. తన మైండ్‌సెట్‌కు తగ్గట్లుగా ఏవైనా ఘటనలు జరిగితే తక్షణం స్పందిస్తారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న దాడుల రాజకీయాలపైనా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు ఇక నుంచి బాక్సింగ్, కరాటే, కర్ర సాము వంటివి నేర్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయని తేల్చేశారు. ఆయన అలా ఎందుకన్నారో అందరికీ తెలుసు.
సాధారణంగా వయోలెన్స్‌ను ఇష్టపడే ఆర్జీవి.. రెండు రోజుల కిందట ఏపీలో జరిగిన పరిణామాలు బాగా ఆసక్తికరంగా కనిపించి ఉంటాయి. సీసీ కెమెరాల్లో చూసిన దృశ్యాలు ఆయనను ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంత మంది సుత్తులతో కార్యాలయ సిబ్బందిని మోదడం, కర్రలు, పలుగులతో ధ్వంసం చేయడం.. పెద్ద పెద్ద బండరాళ్ల కార్ల అద్దాలను పగుల గొట్టడం వంటివన్నీ చూసి ఇంతటితో ఆగవని.. ఆయన నిర్ధారించేసుకున్నారు. ప్రతీకారంగా ఇతర పార్టీల నేతలు కూడా చేస్తారు కాబట్టి అందరూ బాక్సింక్, కరాటే, కర్రసాము నేర్చుకుంటారని చెబుతున్నారు.
Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?
ఆర్జీవీ పెట్టిన ఈ కామెంట్‌ను నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్జీవీకి మరో స్టోరీ దొరికేసిందని సలహాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ముందుగా ఆర్జీవీ సినిమా తీస్తున్నానని ప్రకటన చేసేస్తూంటారు. తర్వాత పోస్టర్ రిలీజ్ చేస్తూంటారు. అయితే అలాంటి సినిమాలు చాలా వరకు తెరకు ఎక్కవు. అందుకే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఎవరేమనుకున్నా ఆర్జీవీ మాత్రం తన స్పందనలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూనే ఉంటారు. నెటిజన్లు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటున్నారంటూ ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించిన ఆయన చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి