ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా మానస్, విశ్వ, కాజల్, రవి, సన్నీ ఎంపికయ్యారు. వీరికి బెలూన్ టాస్క్ ఒకటి ఇచ్చారు బిగ్ బాస్. ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. 'నేనవుతా రవి కెప్టెన్..' అంటూ కాజల్ చెప్పగా.. 'సంపాదించు.. అడుక్కోకు' అని డైలాగ్ వేశాడు రవి. బజర్ మోగిన వెంటనే పెడెస్టెల్ పై ఉన్న గుండుసూది కోసం పరుగెత్తుకుంటూ వెళ్లారు హౌస్ మేట్స్. ప్రియాంక, విశ్వ, లోబో ముందుగా వెళ్లగా.. ప్రియాంకను తోసుకుంటూ విశ్వ వెళ్లడంతో ఆమె కింద పడిపోయింది. 


Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..


దీంతో విశ్వపై ప్రియాంక మండిపడింది. 'ప్రతిదానికి నీకు కండబలం ఉంది.. అందరికీ లేదు' అని ప్రియాంక అనగా.. 'కండబలం అని ఎందుకు అంటున్నావ్' అంటూ ప్రియాంక మీద అరవగా.. ఆమె కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయింది. మగాడివి కాబట్టి బలం ఎక్కువగా ఉంటుందని అరుస్తుండగా..  'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు.. ఇక్కడ అందరూ కంటెస్టెంట్స్' అంటూ అరిచాడు విశ్వ. 


ఆ తరువాత విశ్వ గుండుసూదిని తీసుకెళ్లి రవి చేతిలో పెట్టాడు. ఆ పిన్ ని చూపిస్తూ కాజల్ తో మాట్లాడాడు రవి. 'ఈ పిన్ నీ చేతుల్లోకి వస్తే సన్నీ బెలూన్ పొడుస్తావా..? నా బెలూన్ పొడుస్తావా..?' అని ప్రశ్నించాడు రవి. ఆ తరువాత కాజల్ తన దగ్గరున్న పిన్ తో విశ్వ బెలూన్ ను పొడిచే ప్రయత్నం చేసింది. దానికి విశ్వ.. సరైన కారణం చెప్పి పొడవమని అనగా.. 'నువ్ రెండు సార్లు కెప్టెన్ అయ్యావ్' అని కాజల్ చెప్పగా.. కష్టపడి అయ్యానని బదులిచ్చాడు విశ్వ. ఆ తరువాత రవి.. మానస్ బెలూన్ ను పొడిచేశాడు. ప్రోమోలో చివరిగా కాజల్ ఏడుస్తూ కనిపించింది.