ఎన్నో ట్విస్ట్ ల మధ్య జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే చాలా చేస్తానని మంచు విష్ణు ఒక మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'మా' కోసం బిల్డింగ్ కట్టిస్తానని.. దానికోసం సొంత డబ్బు ఖర్చు చేస్తానని చెప్పారు. ఆ సమయంలోనే రెండు, మూడు స్థలాలను కూడా చూస్తున్నట్లు మంచి విష్ణు చెప్పారు. నిన్న ట్విట్టర్ లో 'మా' సభ్యులకు ఓ గుడ్ న్యూస్ చెబుతానని మంచు విష్ణు అనడంతో.. అందరూ ఏంటా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. 


Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..


ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు రివీల్ చేశారు మంచు విష్ణు. ముందునుంచి కూడా తన ప్యానెల్ లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని.. ఇండస్ట్రీలో ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తానని.. శ్రీరెడ్డి లాంటి వాళ్లకు కూడా న్యాయం చేస్తానని మంచు విష్ణు అన్నారు. ఇప్పుడు దానికి తగ్గట్లే ఒక స్టెప్ ముందుకేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'WEGC' (Women Empowerment & Grievance Cell) అనే కమిటీను ఏర్పాటు చేసింది. 


ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో మొత్తం నాలుగు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని చెప్పారు మంచు విష్ణు. త్వరలోనే కమిటీ మెంబర్స్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఎక్కువ మంది మహిళలనే కమిటీ మెంబర్లుగా నియమించాలని చూస్తున్నట్లుగా తెలిపారు. మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వేసే మొదటి స్టెప్ WEGC అని.. 'మోర్ పవర్ టు విమెన్' అని రాసుకొచ్చారు మంచు విష్ణు. 


ఇక 'మా' ఎన్నికల్లో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరూ చూశారు. ఇప్పటికీ కూడా ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఫుటేజ్ వస్తే 'మా' ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో నిరూపిస్తానని చెబుతున్నారు ప్రకాష్ రాజ్.