క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్) కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్లాప్‌ కింద చేపట్టిన కార్యక్రమాలను సీఎం జగన్ సమీక్షించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. వాతావరణానికి, ప్రజలకు హానికలిగించే వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సీఎం సూచించారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రేడ్‌-2,3 నగరపంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వీలైనంత తర్వగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 


Also Read: అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న


నీరు, గాలి కాలుష్యంపై పరీక్షలు


నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీపంలో ఉంటే నివాసాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా  అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎప్పిటికప్పుడు వ్యర్థాలను తొలిగించాలని, దుర్వాసన వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే కర్మాగారం సిద్ధమైందని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ప్లాంట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించడంతో వాటి నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో కూడా డస్ట్ బిన్స్ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని, గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్నారు. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంక్‌లను పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు.


Also Read:  చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత ! 


ఫిర్యాదులపై పరిష్కరించండి


మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నివాస ప్రాంతాల్లో మురుగునీటి నిల్వ లేకుండా చేయాలన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలను అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను ఉపయోగించుకోవాలన్నారు. క్లాప్‌ కార్యక్రమాల అమలుకు కమాండ్‌ కంట్రోల్‌ రూపంలో అధికారులను నియమించాలన్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.


Also Read:  చంద్రబాబు ఓ గంట టైమిస్తే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... వైసీపీపై విరుచుపడ్డ పరిటాల సునీత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి