మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచీ  అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం స్వీకారం వరకూ 'మా'  సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. ఎన్నికలు ముగిసాయి... మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అంతా బాగానే ఉంటుంది..ఎప్పటిలా అందరూ కలసి ఉంటారేమో అని ఆశపడ్డారు ఫిల్మ్ నగర్ జనాలు. కానీ ప్రకాశ్ రాజ్ మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు. దీంతో 'మా' వివాదం సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. ఆ వేడి చల్లారుతుందిలే అనుకున్న ప్రతిసారీ మరింత రాజుకుంటోంది. లేటెస్ట్‌గా మరో బాంబు పేల్చారు మోనార్క్‌. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించిన ప్రకాశ్ రాజ్ ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు.






పోలింగ్‌, కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ పదేపదే ప్రశ్నించాం. అలాంటి వారిని కౌంటింగ్‌ ప్రాంతాలకు అనుమతించారని ఆరోపించాం. కానీ ఆ ఆరోపణలు మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు ప్యానల్ నుంచి చాలామందిని నల్ల బ్యాడ్జీలతో ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ‘మా’..కి సంబంధం లేని వ్యక్తులను అనుమతించకూడదు. కానీ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించలేదని లేఖలో ప్రస్తావించారు.  ప్రధానంగా ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్‌ నూకల సాంబశివరావు పాల్గొన్నారని ప్రకాష్‌ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇతడిపై జగ్గయ్యపేట పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎన్నో  బెదిరింపులు, సెటిల్‌మెంట్ల కేసులు ఉన్నాయని నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలిస్తుండగా.. అడ్డుకోబోయిన ఎస్సైని కారుతో ఢీకొట్టాలని చూశాడని చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజున ఓ వ్యక్తి పోలింగ్‌ సమీపంలోనే తిరిగాడు. అతనికి క్రిమినల్ బ్యాగ్రౌండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్‌ చాలా ఉన్నాయి. అందుకే స్పష్టమైన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. కొంతమంది పోలింగ్‌ రోజున హాల్‌లోనే తిరిగారు’ అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. చూస్తుంటే ‘మా’ ఎన్నికలు- ఓటమిని ప్రకాష్ రాజ్‌  అంత ఈజీగా  మరచిపోయేలా కనిపించడం లేదంటున్నారంతా. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో వెయిట్ అండ్ సీ..
Also Read: ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్స్ ర్ సుధా చంద్రన్
Also Read: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
Also Read: 'హెడ్స్ అండ్ టేల్స్' సమీక్ష: సీరియస్ ఇష్యూకు సొల్యూషన్ అంత ఈజీనా?
Also Read: దీన్నే వాడుకోవడమంటారు.. సిరిని తిడుతూ ఏడ్చేసిన షణ్ముఖ్..
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి