హుజురాబాద్ ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర  సమతి అధినేత కేసీఆర్ ప్రచారంపై సందిగ్ధం నెలకొంది. పట్టుమని ప్రచార గడువు వారం రోజులు కూడా లేదు. అయినప్పటికీ కేసీఆర్ ప్రచారంపై స్పష్టత లేకుండా పోయింది ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో బహిరంగసభలకు అనుమతి లేకపోవడంతో పొరుగు నియోజకవర్గాల్లో భారీ సభ పెట్టాలని అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు.  ఈ ప్రయత్నాలనూ ఎన్నికల సంఘం అడ్డుకుంది.  తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకార కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనుంది. 


Also Read : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !


ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఒక మున్సిపల్ కార్పొరేషన్‌లో లేదా మెట్రోపాలిటన్ నగరంలో లేదా రాష్ట్ర రాజధానిలో ఉన్నట్లయితే ఎలక్షన్ కోడ్ కేవలం ఆ నియోజకవర్గ పరిధిలోకి మాత్రమే ఉంటుందని, కానీ ఈ మూడు విభాగాలకు చెందని నియోజకవర్గం అయినట్లయితే మొత్తం జిల్లాకు వర్తిస్తుందని ఈసీ తాజా నోటీసులు ఇచ్చింది.  నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగసభలు పెట్టడం కోడ్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధం అని స్పష్టం చేసింది. దీంతో టీఆర్ఎస్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. 


Also Read : ఉపఎన్నిక పొరుగు జిల్లాల్లో రాజకీయ కార్యకలాపాలు వద్దు... కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల


కేసీఆర్ ప్రచారాన్ని రెండు రోజుల పాటు పెంచి.. రోడ్ షోలు నిర్వహించానే ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బహిరంగసభ నిర్వహణ కోసం ఇప్పటికే హరీష్ రావు స్థలం చూశారు. కానీ ఇప్పుడు జిల్లాల సరిహద్దుల దాటి అయినా సభ పెట్టాలి.. లేకపోతే..  నిబంధనలకు అనుగుణంగా రోడ్ షో అయినా నిర్వహించాలి. రోడ్ షో నిర్వహిస్తేనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని ప్రాథమికంగా టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్


అయితే కేసీఆర్ ప్రచారం చేయాలనే ఆలోచనలో లేరని టీఆర్ఎస్‌లో ఓ వర్గం చెబుతోంది. కేటీఆర్ కూడా ఇంత వరకూ కేసీఆర్ ప్రచారంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో దళిత బంధు పథకం ప్రారంభాన్ని కేసీఆర్ హుజురాబాద్‌లోనే నిర్వహించారు. ఆ ప్రచార సభ సరిపోతుదంనే అంచనాలో కొంత మంది ఉన్నారు. అయితే పోటీ తీవ్రంగా ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ప్రచారానికి రావాలని హుజురాబాద్ నేతలు కోరుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్ ప్రచారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి