దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 15,786 కొత్త కేసులు నమోదుకాగా 231 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,75,745కి పెరిగింది.










కేరళ.. 


కేరళలో కొత్తగా 8,733 కేసులు నమోదయ్యాయి. 118 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 48,79,317కు పెరిగింది. మృతుల సంఖ్య 27,202కు చేరింది.


మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో 1,434 కేసులు నమోదుకాగా తిరువనంతపురం (1,102), త్రిస్సూర్ (1,031) కేసులు నమోదయ్యాయి.









మహారాష్ట్ర..








మహారాష్ట్రలో కొత్తగా 1573 కేసులు నమోదుకాగా 39 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,98,218కి పెరిగింది.


వ్యాక్సినేషన్..


వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల ఘనత సాధించిన సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు.​ దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.






Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి