MAA : ‘మా’ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం.. రౌడి షీటర్లతో ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపణలు !

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కొత్త ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన రౌడిషీటర్ ను పోలింగ్‌ కేంద్రంలో ఉంచి ఓటర్లను బెదిరించారని ఆయన ఫోటోలు, వీడియోలు బయట పెట్టారు.

Continues below advertisement

‘మా’ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకుందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు జగ్గయ్యపేటకు చెందిన  రౌడీషీటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన నూకల సాంబశివరావు ఎన్నికల హాల్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్‌లోనూ షేర్ చేశారు. నూకల సాంబశివరావు అనే వైఎస్ఆర్ సీపీ నేత నొటరియల్ క్రిమినల్‌గా ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను కూడా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని సీసీ టీవీ ఫుటేజీ ఇస్తే.. అసలు ఏం జరిగిందో మొత్తం బయటపెడతామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 

Continues below advertisement

 #MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN

Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్

"మా"లో నూకల సాంబశివరావు సభ్యుడు కాదు. అయినా ఆయన ఎందుకు లోపలికి వచ్చారు.. ఆయనను ఎందుకు అనుమతించారన్నది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రశ్న. పోలింగ్ హాల్‌లో ఉండి ఓటర్లను ఆయన బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. "మా" ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే బయటకు ఇలా ప్రకటన చేసినప్పటికీ పార్టీ తరపున రౌడీషీటర్ నూకల సాంబశివరావును పంపారని ప్రకాష్ రాజ్ వర్గీయులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పోరాటం చేస్తున్నారు. ఆయన తన ప్యానల్ సభ్యులందరితోనూ రాజీనామా చేయించారు. సీసీ టీవీ ఫుటేజీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఇస్తామని చెప్పిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తర్వాత కోర్టుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఈ అంశంపై ప్రకాష్ రాజ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో కొన్ని కెమెరాల సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇప్పుడు కొత్త ఆరోపణలతో తెర ముందుకు వచ్చారు. 

Also Read:  అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు

ప్రకాష్ రాజ్ ఆరోపణలు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. "మా"లో సభ్యులు కాని వారిని లోపలికి రానివ్వడం సాధ్యం కాదు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానల్ బ్యాడ్జ్‌లు పెట్టుకుని ఆయన రౌడీషీటర్ అక్కడ తిరిగారు. ఆయనకు అక్కడ ఏం పని అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. మరో వైపు మంచు విష్ణు ఈ రోజు "మా"కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తానని చెప్పారు. ఆయన ప్రకటించక ముందే ప్రకాష్ రాజ్ షాకింగ్ న్యూస్ ఇచ్చినట్లయింది. 

Also Read : అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement