Bathukamma Celebrations: తెలంగాణలో అతిపెద్ద పండుగలలో ఒకటైన బతుకమ్మకు విశ్వ వేదికపై మరోసారి గుర్తింపు దక్కనుంది. తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై రేపు బతుకమ్మను ప్రదర్శించనున్నారు. 


అక్టోబర్ 23న రాత్రి 9.40 నిమిషాలకు , 10.40 నిమిషాలకు  ప్రపంచంలోని ఎత్తైన భవనమైన దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై  బతుకమ్మ వీడియో ప్రదర్శితం కానుంది. కాగా, బతుకమ్మను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది బుర్జ్ ఖలీఫా కావడం విశేషం. తెలంగాణ ఖ్యాతిని, బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


Also Read: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్.. పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై తెలంగాణ పూల పండుగ బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు రాత్రి రెండు పర్యాయాలు బతుకమ్మ వీడియోను ఈ ఎత్తైన భవనంపై ప్రదర్శిస్తారు. తెలంగాణకు చెందిన ప్రముఖులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు దుబాయ్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా.. 


ప్రవాస తెలంగాణ ప్రజలు కూడా చాలా అట్టహాసంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ కోసం ఆస్కార్ విజేత రెహమాన్ మ్యూజిక్  అల్లిపూల వెన్నెల పాటకు మ్యూజిక్ అందించారు. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్వర్తించారు.






ఉన్ని క్రిష్ణన్ గాత్రం అందించిన ఈ అల్లిపూల వెన్నెల పాటకు తెలంగాణాకు చెందిన మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. భూదాన్ పోచం పల్లి ఏరియాలో ఈ పాట షూటింగ్ జరిగింది. బతుకమ్మ సందర్బంగా పాటను గ్రాండ్ రిలీజ్ చేయడం తెలిసిందే.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి