మేషం
ఈ రోజంతా మీకు శుభసమయమే. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. తెలియని వారిని నమ్మొద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారం బాగానే ఉంటుంది.ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. యువత ప్రయోజనం పొందుతుంది.
వృషభం
ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార సంబంధిత ప్రణాళిక విజయవంతమవుతుంది. ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో శాంతి ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వవద్దు. వివాదాలు తలెత్తవచ్చు. మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఇతరుల బాధ్యత మీరు తీసుకోకండి. తొందరగా అలసిపోతారు.
మిథునం
చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. రుణాలు ఇవ్వవద్దు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇంటి బయటా ఆనందందా ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాయం, వ్యాధి కారణంగా బాధపడతారు.
Also Read: స్త్రీలు ఈ నోము నోచుకుంటే వివాహితులకు సౌభాగ్యం … అవివాహితులకు మంచి భర్త లభిస్తాడట..
కర్కాటకం
కార్యాలయంలో మార్పులుంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. విలాసాలు మరియు సౌకర్యవంతమైన వాటికోసం ఖర్చు చేస్తారు. తొందరపాటు వద్దు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
సింహం
వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తుల బాధ్యత పెరుగుతుంది. సహోద్యోగులతో విభేదాలు ఉండొచ్చు. టెన్షన్ కొనసాగుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. ఒకరి ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి.
కన్య
మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. పని సమయానికి జరుగుతుంది. మతపరమైన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పెద్ద బాధ్యతను నిర్వర్తించడం ద్వారా సంతోషం ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. రిస్క్ తీసుకోకండి.
Also Read: ఆ విషయాల్లో మగవారి కన్నా మగువలే ముందుంటారట..!
తుల
పాత స్నేహితులతో కలుస్తారు. ప్రోత్సాహకరమైన సమాచారాన్ని పొందుతారు. ఏదైనా పెద్ద పని చేయడానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. బంధువులను కలుస్తారు. అతిగా తినొద్దు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం
పేదలకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఎవరితోనైనా అకస్మాత్తుగా వివాదాలు ఉండవచ్చు. ప్రయాణాలుంటాయి.
ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు శుభసమయం. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి. మీరు చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కోవచ్చు. దుర్వార్తలు వినే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అవివాహితులకు అనుకూల సమయం.
Also Read: త్రిశంకు స్వర్గం@ విశ్వామిత్ర క్రియేషన్స్...
మకరం
తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. తొందరపాటు వద్దు. టెన్షన్ తగ్గుతుంది. బాధ్యతలన్నీ నిర్వర్తిస్తారు.
కుంభం
మీ పూర్వీకుల ఆస్తిలో వాటాను పొందుతారు. ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. వ్యాపారంలో అనుకూలమైన లాభాలు ఉంటాయి. ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం సులభంగా కనుక్కుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం పెరుగుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. శత్రువులు ఓడిపోతారు. వేరే వారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు.
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఎవరితోనైనా విభేదాలు ఉండొచ్చు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. తొందరపాటు తగ్గించకుంటే నష్టపోతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి సహాయం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దలు ఆశీర్వచనాలు అందుతాయి.
Also Read: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....
Also Read: రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా?
Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
ABP Desam
Updated at:
23 Oct 2021 07:39 AM (IST)
Edited By: RamaLakshmibai
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 అక్టోబరు 23 శనివారం రాశిఫలాలు
NEXT
PREV
Published at:
23 Oct 2021 06:46 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -