బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ మొదట్లో మళయాలం, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది.  నాని హీరోగా నటించి ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను పిధా చేసిన నివేదా తర్వాత వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. 'నిన్ను కోరి', 'జై లవకుశ', '118, 'బ్రోచేవారెవరురా'  సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మధ్యే  పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో పల్లవి పాత్రలో అదరగొట్టేసింది. అటు తమిళంలోనూ రజనీకాంత్ దర్బార్ తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ జోరుగా ఉండే ఈ కేరళ పిల్ల తాజాగా ట్విట్టర్లో  షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.  






ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను అధిరోహించిన నివేదా...  శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. ఆ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎత్తైన పర్వతం అధిరోహించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో పేర్కొంది. ఇక నివేదా థామస్ కొత్త ప్రాజెక్ట్స్ విషయానికొస్తే  సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు  ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే నటిస్తాననుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది నివేదా.... 
Also Read: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read:  ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్..
Also Read: ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ హంగామా.. ఇవిగో వీడియోలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి