'ద ఘోస్ట్'లో కాజల్ అగర్వాల్ నటించడం లేదు. ఆ సినిమా నుండి ఆమె బయటకు వచ్చేశారు. ప్రస్తుతానికి అయితే నాగార్జునకు జోడీగా ఆమెను చూడలేం! ఆల్రెడీ కాజల్ ప్లేస్‌లో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేశారు. నాగార్జునకు జంటగా అమలా పాల్ నటించనున్నారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ద ఘోస్ట్' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున మాజీ రా ఏజెంట్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రోల్ కూడా సినిమాలో కీలకమే. హీరో మాజీ రా ఏజెంట్ అయితే... హీరోకి హెల్ప్ చేసే ప్రజెంట్ రా ఏజెంట్ రోల్‌లో హీరోయిన్ కనిపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
నాగార్జునతో రొమాన్స్ చేయడం మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ అమలా పాల్ కనిపించనున్నారు. ఆల్రెడీ నాగార్జున, కాజల్ మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్, గోవాలో కొన్ని రోజులు చిత్రీకరణ చేశారు. కాజల్ గర్భవతి కావడంతో సినిమా నుండి తప్పుకొన్నారు. ఆమెపై తీసిన సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయక తప్పదు. త్వరలో అవన్నీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఇక్కడ విశేషం ఏమిటంటే... కాజల్ అగర్వాల్, అమలా పాల్ గతంలో ఓ సినిమా చేశారు. రామ్ చరణ్ 'నాయక్'లో హీరోయిన్లు వాళ్లిద్దరే! అందులో చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు. సో... ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఇప్పుడు నాగార్జున సినిమాలో కాజల్ తప్పుకోవడంతో అమలా పాల్ వచ్చారు.
నాగార్జున, అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా హిందీ నటి గుల్ పనాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.