ఓబీసీ రిజర్వేషన్లపై 15 మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై కోర్టు  ఉత్తర్వులిచ్చింది. సౌరవ్ యాదవ్ కేసు సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం పిటిషనర్లను మూడు నెలల్లో నియమించాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 15 మంది వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసే సమయంలో ఈ మేరకు జస్టిస్ అశ్వనీ కుమార్ ఈ ఆదేశాలిచ్చారు. అయితే అంతకు ముందు అడ్వకేట్ సీమంత్ సింగ్ వాదనలు వినిపించారు.


రిజర్వేషన్‌లో, పిటిషనర్లు కట్ ఆఫ్ మెరిట్ కంటే తక్కువ మార్కులు పొందారని చెప్పారు. దీని కారణంగా ఎంపిక చేయలేదని చెప్పారు. చాలా పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయని.. జనరల్ కేటగిరీలో చివరిగా ఎంపికైన మహిళా అభ్యర్థి మార్కుల కంటే పిటిషనర్లకు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పారు.


అలాంటి పరిస్థితిలో, పిటిషనర్లు రిజర్వేషన్లు కోరారని చెప్పారు. పిటిషనర్లు రిజర్వేషన్ల ద్వంద్వ ప్రయోజనాలను పొందలేరని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ వారు వెనుకబడిన తరగతుల మహిళల కోటాలో విజయం సాధించకపోతే, సాధారణ కేటగిరీ మహిళల సమానత్వం కోరలేరని పేర్కొంది. కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. జనరల్ కోటాలోని మహిళా అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కుల ఆధారంగా వెనకబడిన తరగతుల మహిళా అభ్యర్థులను నియమించాలని ఆదేశించింది. కటాఫ్ మెరిట్ మార్కుల కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులకు నియామకాన్ని నిరాకరించరాదని కోర్టు పేర్కొంది.


Also Read: East Godavari Crime: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు


Also Read: CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ


Also Read: TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...


Also Read: లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్... కేంద్రం నిధులతో టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు... బండి సంజయ్ సంచలన కామెంట్స్


Also Read: Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్


Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి