రాత్రులు ఇంటి కిటికీ దగ్గర ఏవేవో దెయ్యం అరుపుల శబ్దాలు.. లైట్లు వేసి బయటకు వెళ్లి చూస్తే అంతా నిశ్శబ్దం. ఫస్ట్ చాలా కంగారు పడ్డారు. ఆ శబ్దాలు ఎవరో సెల్ఫోన్ నుంచి వస్తున్నాయని కనిపెట్టి ఎవరో ఆకతాయిల పని అనుకున్నారు. కొన్ని రోజులకి ఇంటి బాత్రూం కిటికీల దగ్గర అలజడి. బయటికెళ్ళి చూస్తే అంతలోనే మాయం. ఇలా చుక్కలు చూపించిన అజ్ఞాత వ్యక్తి చివరకు మహిళ సెల్ ఫోన్ కు నీలి చిత్రాలు పంపించి అడ్డంగా బుక్కయ్యాడు.  అర్ధరాత్రి వేళ కిటికీ దగ్గర దెయ్యం శబ్దాలు వినిపించింది.. బాత్రూమ్ కిటికీల దగ్గర అలజడి సృష్టించింది ఆ యువకుడేనని తెలిసి షాకయ్యారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయించారు. 


Also Read:  మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!


అసలేం జరిగిందంటే...?


ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన దంపతులకు ప్రత్యక్ష నరకం చూపించాడు ఓ సైకో. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు చాలా కాలంగా ఈ దంపతుల ఇంటికి తరచూ వస్తూ వారిలో ఒకరిగా కలిసిపోయేవాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా వారితో సరదాగా ఉండే వాడు. సరిగ్గా రెండు నెలల నుంచి ఇంటికి వస్తూనే రాత్రివేళల్లో వెకిలి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం రహస్యంగా చేసిన సైకో నేరుగా ఆ మహిళకే  రకరకాల బూతు వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి తండ్రికి, పెద్దలకు చెప్పి హెచ్చరించినా ఏ మాత్రం మార్పు లేకపోగా ఇంకా చెలరేగిపోయాడు. మరిన్ని నీలిచిత్రాలను సదరు మహిళ వాట్సాప్ నెంబర్ కి పంపి అనేక మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన దంపతులు శుక్రవారం అల్లవరం పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్ వచ్చిన వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


Also Read: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం


Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని..


Also Read: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి