నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో బాధిత బాలిక ఏకంగా పోలీసులపైనే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తాను ఫిర్యాదు చేసిన వ్యక్తి తనకు ముందే తెలుసని, అతనితో తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేసినట్టు బాలిక పేర్కొంది. ఈ మేరకు ఓ లేఖ కూడా బయటకు విడుదలైంది. బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఒకరు అరెస్ట్, మిగతా వారి కోసం గాలింపు
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో కొండాపురం ఎస్సై బాలిక వద్ద స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత కావలి డీఎస్పీ ప్రసాద్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేసులో పలుకోణాలు ఉండటంతో నెల్లూరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో కేసు ముందుకు సాగుతోంది. కేసు విచారణలో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.
Also Read: యూపీలో ఘోరం.. జిల్లా కోర్టులో లాయర్ దారుణహత్య.. రోహిణి షూటౌట్ మరువకముందే..!
పొంతన లేని సమాధానాలు
ఇదిలా ఉండగా బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెరుగు ప్యాకెట్ కోసం వెళ్లిన నన్ను నలుగురు అత్యాచారం చేశారని చెప్పిన బాలిక, ఆ తర్వాత ఒకరే తనను బలాత్కారం చేశారంటోంది. చివరకు పోలీసులు కూడా తనను కొట్టారని అంటోంది. తనతో పాటు ఉన్న వ్యక్తికి తనకు పరిచయం ఉన్నట్టు పోలీసులు చెప్పమన్నారని, అలా ఒప్పుకోవాలని బలవంతం పెట్టారని అంటోంది. దీంతో ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. అయితే దళిత బాలికపై సామూహిక అత్యాచారం అనే ఆరోపణ రావడంతో అందరూ అలెర్ట్ అయ్యారు. డీజీపీ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారని సమాచారం. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఒకరు అరెస్ట్ కాగా, మిగతా వారికోసం గాలిస్తున్నారు.
"అంగడి పోయినా అక్కడ పెరుగు అడిగా లేదన్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒకడు వెంట వచ్చాడు. నన్ను కట్టేసి చెరువులోకి తీసుకెళ్లారు. ఈ తర్వాత నాపై అత్యాచారం చేశారు. ఈ విషయాలను పోలీసులు బయట చెప్పొద్దన్నారు" - బాధిత బాలిక
Also Read: జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !