ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పుల ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఓ లాయర్ హత్యకు గురయ్యారు. ఏబీపీ న్యూస్ అందుకున్న సమాచారం ప్రకారం.. లాయర్ మృతదేహాన్ని షాజహాన్‌పూర్ కోర్టులోని మూడవ అంతస్తులో గుర్తించారు. లాయర్ మృతదేహం పక్కన ఓ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన న్యాయవాదిని భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. రోహిణి కోర్టులో కాల్పుల ఘటన తరువాత కోర్టులోకి ప్రవేశం కోసం న్యాయవాదులకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని బార్ కౌన్సిల్‌లు హైకోర్టును అభ్యర్థించాయి. 


రోహిణి షూటౌట్‌తో లాయర్లలో టెన్షన్ టెన్షన్..


ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణమైన రోహిణి కాల్పుల ఘటన తర్వాత, కేవలం స్మార్ట్ కార్డు చిప్ కలిగి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని ఢిల్లీ హైకోర్టును లాయర్లు అభ్యర్థించారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డీహెచ్‌సీబీఏ) మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ (బీసీడీ), కోర్టు భద్రతను మెరుగుపరచడం కోసం లాయర్లకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని బెంచ్‌కు విన్నవించారు. కోర్టు ప్రాంగణంలో లాయర్ల భద్రత మరియు రక్షణకు సంబంధించిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.  ఈ సెప్టెంబర్ 24న రోహిణి కోర్టులో కాల్పుల ఘటన తరువాత ఈ విచారణ ప్రారంభించారు. 


Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్ 


స్మార్ట్ కార్డులు, ఈ కార్డులు జారీకి ప్రతిపాదనలు


కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మరియు వివిధ బార్ అసోసియేషన్‌లతో సహా లాయర్లను కోర్టు ప్రాంగణంలో భద్రతపై తమ సలహాలను కూడా అందించాలని బెంచ్ గతంలో కోరింది. సుప్రీంకోర్టులో సైతం స్మార్ట్ కార్డులతో లాయర్లు, జడ్జీలను అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ డిజిటలైజ్డ్ కార్డుల ద్వారా స్కాన్ చేసి కోర్టులోకి ప్రవేశాలు కల్పించడం సరైన మార్గమని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు సీనియర్ న్యాయవాది మోహిత్ మాథుర్ అన్నారు. న్యాయవాదులను కోర్టు ఆవరణలో ప్రవేశాల కోసం ఒక చిప్‌ అమర్చిన కొత్త కార్డు జారీ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీకి చెందిన న్యాయవాది దేవేంద్ర సింగ్ ఇటీవల కోరారు.


Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ? 


లాయర్లు కచ్చితంగా సెక్యూరిటీ చెకింగ్ నియమాలకు కట్టుబడి ఉండాలని, ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని బార్ అసోసియేషన్ పేర్కొంది. లాయర్లు, జడ్జీలతో సహా సందర్శకులందరూ అధునాతన మెటల్ డిటెక్టర్‌ల టెస్టులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. హైటెక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా అన్ని వాహనాలను తనిఖీ చేయాలని కోరారు. కోర్టు సిబ్బందికి సైతం గుర్తింపు కార్డులు జారీ చేయాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి