"ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదు.. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకునే ఎన్నికలకు వెళదాం..!" అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకు తేల్చి చెప్పేశారు. అయితే కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మళ్లీ చర్చ జోరందుకుంటోంది. ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయడానికే అలా చెబుతున్నారని.. కానీ కేసీఆర్  ముందస్తుకు వెళ్లడం ఖాయమని గట్టి నమ్మకాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఎన్నికల కోణంలో ఉండటమే. 


ఈ సారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుడు ఖాయమన్న కేసీఆర్ !
తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చ ఆరు నెలల నుంచి జరుగుతోంది. కేసీఆర్ ఎప్పుడైతే చురుకుగా జన క్షేత్రంలోకి వచ్చారో అప్పటి నుండి ఆయనది ముందస్తు ఎన్నికల వ్యూహమేనని భావించడం ప్రారంభించారు.  ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. భారీగా హామీలు ఇస్తున్నారు. పథకాలు ప్రకటిస్తున్నారు.  కేసీఆర్ లక్ష్యం కేటీఆర్‌ను సీఎం చేసి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చక్రం తిప్పుతామని ప్రకటించారు.





Also Read : మన సరిహద్దులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా... అనారోగ్యమా? అగ్ర నేత మృతిపై ఆరా తీసేందుకా...?


"టైమింగ్‌ రాజకీయాల్లో" కేసీఆర్‌ను మించిన వారు లేరు.!
ఎన్నికల్లో గెలుపు కోసం టైమింగ్ కూడా ముఖ్యమని కేసీఆర్ నమ్ముతారు.  పార్లమెంట్ ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ విషయం కేసీఆర్ గుర్తించే గతంలో ఆరు నెలలు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మంచిఫలితాలు సాధించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి ఎదురుదెబ్బ తిన్నారు. అందుకే మరోసారి ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు. మామూలుగా అయితే 2023లో ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ మరోసారి ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. వచ్చే ఏడాది నంబర్, డిసెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు తెలంగాణకూ జరగొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.


Also Read : గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన


ముందస్తు ఖాయమని నమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీ !
ముందస్తు ఎన్నికలు వస్తాయని విపక్ష పార్టీలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని కావాలంటే రాసి పెట్టుకోవాలని సవా‌ చేశారు. బీజేపీ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కేసీఆర్‌కు నిజాలు చెప్పే అలవాటులేదు కాబట్టి ముందస్తు ఎన్నికల్లేవని ప్రత్యేకంగా చెప్పారంటే..  ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేత విజయశాంతి రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. 








Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్


కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అర్థం చేసుకోవడం అసాధ్యం ! 
కేసీఆర్ సాధారణంగా తన ఆలోచనల మేరకు ప్రజల్లో చర్చ జరిగేలా ప్రకటనలు చేస్తారు.  ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత మాత్రమే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గతంలో అసెంబ్లీ రద్దు వ్యవహారంలోనూ ఇదే పద్దతి పాటించారు. నిజంగా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే్ ఆలోచన ఉన్నా ఆయన నేరుగా చెప్పే అవకాశం లేదు. అలా చెప్పడం రాజకీయం కాదు. అందుకే కేసీఆర్ ముందస్తు లేదు అనే ప్రకటనను అందరూ ముందస్తుకు సిద్ధమవ్వండి అనే పద్దతిలోనే ఆర్థం చేసుకుని కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.  


Also Read : ఈటల రాజేందర్‌కు హరీష్ రావు మరో సవాల్.. బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి