Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్

ABP Desam Updated at: 22 Oct 2021 07:13 PM (IST)
Edited By: Murali Krishna

వ్యాక్సినేషన్‌పై కేంద్రం చెబుతోన్న వివరాలన్నీ అసత్యాలని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ అందిందని పేర్కొంది.

వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం చెప్పిన వివరాలను ఖండించిన కాంగ్రెస్

NEXT PREV

దేశంలో 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని తప్పుబట్టింది. తప్పుడు లెక్కలతో భాజపా ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకు మాత్రమే పూర్తి రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు చెబుతోంది.


గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు.







ఇది పన్నుదారుల డబ్బు. పన్నులు కట్టేవారికే ఆ డబ్బును వినియోగిస్తున్నారు. కనుక మీ ప్రభుత్వం ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వడం లేదు. అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం మానాలి.                                                        - గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి


పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేసి దాదాపు రూ.33 లక్షల కోట్లు ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. అందులో కేవలం 2 శాతం అంటే రూ.35 వేల కోట్లు మాత్రమే వ్యాక్సినేషన్‌కు ఖర్చు చేసినట్లు  చెప్పారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపై కూడా మోదీ ఫొటో ఉండటాన్ని గౌరవ్ తప్పుబట్టారు.



భారత్ మాత్రమే 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని అసత్యాలు చెబుతున్నారు. ప్రపంచంలో 50 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు రెండు మాత్రమే. చైనా సెప్టెంబర్‌లోనే 216 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. మన దేశ జనాభాలో 50 శాతం మందికి కూడా ఇప్పటికీ సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌ కూడా కాలేదు. మరి దేనికీ సంబరాలు.                                               - గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి


Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ


Also Read: Overthinking Impact: అతిగా ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మ.. బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి!


Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 22 Oct 2021 07:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.