పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018 జనవరిలో విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రత్యక్షంగా పోటీకి దిగారు. ఆ సమయంలో తను సినిమాలకు పూర్తిగా దూరమైనట్లే అని.. మళ్లీ సినిమాలు చేయనని ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయాలని గట్టిగా కోరుకున్నారు. ఆ తరువాత రెండేళ్లకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని అనుకున్నారు.
Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..
'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా తన పార్టీ బలంగా ఉండాలంటే.. సినిమాలు చేయక తప్పదని, అలానే అభిమానులతో కనెక్ట్ అయి ఉండడానికి కూడా సినిమాలు ఓ మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. రీఎంట్రీలో పవన్ వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' లాంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటి తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయాల్సివుంది.
అయితే వీటి తరువాత పవన్ కళ్యాణ్ కొత్తగా సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని సమాచారం. భగవాన్, పుల్లారావులతో పాటు కొందరు నిర్మాతలు పవన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పవన్ మాత్రం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. ఇంకా సినిమాలు ఒప్పుకుంటే 2024 ఎన్నికలు రెడీ కావడం కష్టమవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసిన తరువాత సురేందర్ రెడ్డి సినిమాను హోల్డ్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తన మకాంను విజయవాడకు మార్చబోతున్నాడని.. పార్టీ పనులకు మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి షూటింగ్స్ కోసం హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటాడని.. అవుట్ డోర్ షూటింగ్స్ ఉంటే విజయవాడలో చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి 2023 స్టార్టింగ్ లోనే బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు.
Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
Also Read: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి