కరోనాపై యుద్ధంలో భారత్ పోరాటం అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. భారత్ సాధించిన 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి విజయమని మోదీ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొట్టాలని మోదీ పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారి వచ్చినప్పుడు.. అసలు భారత్ వ్యాక్సిన్ కనుగొట్టుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దేశం ఈనాడు ఉన్న పరిస్థితి చూస్తే దేశ ప్రజలు గర్వంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూశాం. పేదలు, ధనికులు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇది ఎలా సాధించారని అనుకుంటున్నాయి. దీనికి ఒకే ఒక కారణం. అందరినీ కలుపుకొని వెళ్లడమే. - ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచ దేశాలు షాక్..
వ్యాక్సినేషన్‌లో భారత్ స్పీడు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అసలు ఇది ఎలా సాధ్యమని అడిగాయి. ఇది భారత ఐకమత్య శక్తికి నిదర్శనమని వారికి తెలియదు. ఇప్పటివరకు ఆ దేశం ఇది తయారు చేసింది, ఈ దేశం ఇది తయారు చేసింది అని విన్నాం. కానీ ఇక ఏది చూసినా 'మేడ్ ఇన్ ఇండియా' అని ఉండటం చూస్తున్నాం. ఇది భారత్ సాధించిన ఘనత - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి