"బొమ్మ ఎప్పుడు పడితే... అప్పుడే మనకు నవ్వుల పండగ" అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'ఎఫ్ 3'. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా... తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన సినిమా 'ఎఫ్ 2', ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. ఆ సినిమా 2019 సంక్రాంతికి విడుదలైంది. భారీ విజయం సాధించింది.
'ఎఫ్ 2'కు సీక్వెల్ అని చెప్పలేం. కానీ, 'ఎఫ్ 2'లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు తీసుకుని కొత్త కథతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. దీనినీ 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 2'తో పోలిస్తే... ఈ సినిమాలో మరింత వినోదం ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. 'ఎఫ్ 3' కూడా సంక్రాంతికి విడుదల అవుతుందని చాలామంది భావించారు. నిజం చెప్పాలంటే... సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో సినిమాను ప్రారంభించారు.
సంక్రాంతికి థియేటర్ల దగ్గర ఎక్కువ పోటీ నెలకొంది. అందుకని, ముందు జాగ్రత్తగా వెనక్కి వెళ్లినట్టు ఉన్నారు. ఫ్యామిలీ డ్రామా కావడంతో ఎప్పుడు విడుదల చేసినా... 'ఎఫ్ 3'కి ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ సోనాల్ చౌహన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. హాస్యనటుడు సునీల్ కూడా కడుపుబ్బా నవ్వించే పాత్ర చేస్తున్నారు. 'ఎఫ్ 2'లో నటించిన మేజర్ ఆర్టిస్టులు 'ఎఫ్ 3'లోనూ ఉన్నారు.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లో... అతడి రెండో సినిమా!
Also Read: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి