కొంతమంది వందేళ్లు బతుకుతారు... వాళ్లని చూసి అన్నేళ్లు ఎలా జీవించగలిగారని ఆశ్చర్యపోతుంటాం. చాలా మంది అరవై, డెబ్బై ఏళ్లకే మరణిస్తుంటే, కొంతమంది సెంచరీ వయసును ఎలా దాటేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ పరిశోధన సాగింది. ఆ పరిశోధనలో కేవలం నాలుగే అంశాలు మనిషి జీవితాకాలాన్ని పెంచుతున్నట్టు కనిపెట్టారు పరిశోధకులు. ఆ నాలుగు అలవాట్లు మీరూ చేసుకుంటే మీ జీవితకాలాన్ని అదనంగా మరో పద్నాలుగేళ్ల పాటూ పెంచుకోవచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు. Express.co.ukలో ఈ స్టడీ తాలూకు వివరాలను ప్రచురించారు. దాన్ని బట్టి ఈ అధ్యయనం దాదాపు 20,244 మందిపై జరిగింది. వారంతా 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు వారు. ఎలాంటి గుండె జబ్బులు, క్యాన్సర్లు లేని వారిని ఈ అధ్యయనం కోసం ఎంపికచేసుకున్నారు. వీరిపై పరిశోధన ద్వారా జీవనశైలికి, మరణాలకు మధ్య సంభావ్యతను అంచనా వేశారు. ఈ పరిశోధనలో నాలుగు ఆరోగ్యపు అలవాట్లు జీవనకాలాన్ని పెంచేందుకు కీలకపాత్ర వహించినట్టు గుర్తించారు. అవేంటంటే...


1. శారీరకంగా యాక్టివ్
వ్యాయామాలు చేయడం, నడక వంటి పనులతో శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. తినేసి, రోజులో ఎక్కువసేపు కూర్చోకూడదు. వారానికి కనీసం 150 నిమిషాలైనా  వ్యాయామం చేయాలి. లేదా కనీసం రోజుకు ఓ గంట నడవాలి. 
2. నో ఆల్కహాల్ 
ఆల్కహాల్ తాగేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. నిజానికి ఆల్కహాల్ పూర్తిగా మానేస్తే మంచిదే. మానలేనివాళ్లు ఆ అలవాటను అదుపులో ఉంచుకోవాలి. మీకు తెలుసా అమెరికాలో ప్రతి ఏడాది 88,000 మంది ఆల్కహాల్ సంబంధ సమస్యలతో మరణిస్తున్నారు. 
3. పండ్లు, కూరగాయలు 
తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. రోజుకు రెండు రకాల పండ్లు, మూడు రకాల కూరగాయలు తినేవారు ఆరోగ్యంగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. 
4. ధూమపానం మానేయాలి
ఆడా, మగా తేడా లేకుండా నేడు ధూమపానం చేస్తున్నారు. దీనివల్ల మీ జీవితకాలాన్ని మీరే తగ్గించుకున్నవారవుతారు. ధూమపానానికి దూరంగా ఉండడం ఉత్తమం. 40 ఏళ్ల వయసుకు ముందే ధూమపానం అలవాటును వదిలేస్తే, దాని సంబంధిత వ్యాధులతో మరణించే అవకాశం 90 శాతం తగ్గుతుంది. 


ఈ నాలుగు అలవాట్లను పాటిస్తే చాలు... మీ జీవితకాలం మరో పద్నాలుగేళ్ల పాటూ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: బాలయ్యకు స్టెప్పులు నేర్పబోతున్న నటరాజ్ మాస్టర్?


Also read:  చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం


Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి


Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి