ఒకప్పుడు స్టార్ హీరోలు వెండితెరపై మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. బుల్లితెరకు, ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరిగింది. కరోనా వచ్చాక థియేటర్లు మూతపడడంతో భారీగా ప్రేక్షకులు ఓటీటీల బాట పట్టారు. దీంతో స్టార్ హీరోలు హోస్ట్ లుగా మారారు. ఇప్పటికే సమంత, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా హోస్ట్ లుగా అలరించారు. త్వరలో నటసింహం బాలయ్య కూడా ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ షోతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి సంబంధించి షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ఆహాలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.  కాగా ఇప్పుడు ఆ షోకు సంభంధించి ఓ తాజా అప్డేట్ తెలిసింది. 

Continues below advertisement


నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చేప్పుడు ఓ చిన్న పాటకు స్టెప్పులేస్తూ వస్తారు. అదే విధంగా బాలయ్య చేత కూడా చేయిద్దామనుకుంటున్నారట ఆహా టీమ్. అందుకోసమే ఆయనకు కొరియోగ్రఫీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ ఎంపిక చేశారని టాక్. ఇది అధికారికంగా తెలియకపోయినా, అనధికారికంగా నిజమేనని సమాచారం. నటరాజ్ మాస్టర్ బాలయ్యతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో ఖాతాలో తాజాగా పోస్టు చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూర్చినట్టయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో నాలుగువారాల పాటూ ఉన్న నటరాజ్ మాస్టర్ నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యాక ఆహా నుంచి ఆయనకు పిలుపువచ్చిదట. ఈ సందర్భంగానే ప్రత్యేకంగా వెళ్లి బాలయ్యను కలిశారట నటరాజ్ మాస్టర్. సినీ పరిశ్రమలో చిన్న డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నటరాజ్ మాస్టర్ తరువాత కొన్ని రియాల్జీషోలను కూడా నిర్వహించారు. ఆ తరువాత ఆయనకు అవకాశాలు తగ్గాయి. బిగ్ బాస్ షోతో మళ్లీ వెలుగులోకి వచ్చిన ఆయనకు అవకాశాలు తలుపుతడతాయని ఆశిస్తున్నారు అభిమానులు. 






Also read: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం


Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి


Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి