తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని,  హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కోరినా లభించే పరిస్థితులు లేకపోవడంతో ఆయన వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం  రాష్ట్రపతిని కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు . రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. 


Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన ఉద్యమం ! బీజేపీ కలసి వస్తుందా ?


హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఆయన అపాయింట్‌మెంట్ ఎప్పుడు లభిస్తుందో స్పష్టత రాలేదు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లభించే అవకాశం కనిపించలేదు. దీంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం టీడీపీ బృందంతో తిరిరిగి వచ్చేశారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీలో పరిస్థితులను వివరించాలనుకున్నారు. అవినీతి గురించి చెప్పాలనుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఒక్క రాష్ట్రపతిని మాత్రం కలిసి .. ఫిర్యాదు చేయగలిగారు.  


Also Read : మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం
 
హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ లభించిన తర్వాత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్  గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అసభ్యంగా దూషించారంటూ ఆయన ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో  వివాదం ప్రారంభమయింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమయిందని చంద్రబాబు 36 గంటల దీక్ష చేసి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లారు.  టీడీపీ నేతలు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. 


Also Read : ఏపీలో టీఆర్ఎస్‌ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !


తాము కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి టీడీపీ బృందం కలిసిన వారందర్నీ కలిసి నిజాలు చెబుతామని వైసీపీ నేతలు ప్రకటించారు. పనిలో పనిగా ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి తెలుగుదేశం గుర్తింపును రద్దు చేయాలని కోరుతామన్నారు. అయితే వైెఎస్అర్ కాంగ్రెస్ తరపున ప్రత్యేక ప్రతినిధి బృందం కాకుండా.. ఎంపీలే కలిసే అవకాశం ఉంది.


Also Read:Compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి