జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 31వ తేదీన విశాఖపట్నం వెళ్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు సంఘిభావం ప్రకటిస్తారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఉద్యమం ప్రారంభమైన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చాలా సార్లు మాట్లాడారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేయాలనుకుంటోందని తెలిసిన తర్వాత గట్టిగా మద్దతు పలకలేకపోయారు. 


Also Read : మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం


చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉద్యమంలోకి దిగడం ఆసక్తికరకంగా మారింది. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. అక్కడ గెలిపించి ఉంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవాడినని ఇటీవల తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ప్రకటించారు.  అయితే ఇప్పటికే రాజకీయ పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ఈ కారణంగా ఉద్యమం బలహీనపడింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ వారికి మద్దతిచ్చేందుకు రంగంలోకి దిగుతున్నారు. 


Also Read:Compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


ప్రైవేటీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ కల్యాణ్ గట్టిగా వ్యతిరేకించలేకపోవడానికి ఆయన బీజేపీతో పొత్తులోఉండటం కారణం అని చెప్పుకోవచ్చు.  పొత్తులో ఉన్న పార్టీ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా పొత్తులోనే ఉన్నారు. అయినా ఎందుకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారికి మద్దతివ్వాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బీజేపీతో  జనసేనకు గ్యాప్ వచ్చిందన్న అభిప్రాయం రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. 


Also Read : ఏపీలో టీఆర్ఎస్‌ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !


రెండు పార్టీలు ఎవరికి వారు ఏపీలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఉమ్మడి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. కానీ అలాంటివేమీ జరగడం లేదు. బద్వేలు ఉపఎన్నిక విషయంలోనూ రెండు పార్టీలు చర్చించుకున్నా వేర్వేరుగా నిర్ణయాలు తీసుకున్నారు. జనసేన ఎన్నికను బహిష్కరిస్తే బీజేపీ పోటీకి దిగింది. దీంతో ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కల్యమఅ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలోకి అడుగుపెడుతూండటం .. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు సూచనలుగా భావిస్తున్నారు. 


Also Read : మా‌ల్దీవ్స్‌కు వెళ్లిన పట్టాభి ! ఎందుకంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి