" ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పోటీ చేయమని అంటున్నారని..  గెలిపించుకుంటామని చెబుతున్నారని " ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. చాలా కాలం నుంచి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనూ చేశారు. ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లోనూ అన్నారు. ఓ ప్రత్యేకమైన వ్యూహం లేకపోతే కేసీఆర్ అలాంటి మాటలు మాట్లాడరన్న అంచనాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏమిటన్నదానిపైనే పార్టీల్లో ఆసక్తి ప్రారంభమయింది.


Also Read : టీఆర్ఎస్‌లో అసలు "వర్క్" అంతా కేటీఆర్‌దే ! ప్లీనరీ సక్సెస్‌తో మరోసారి పట్టు నిరూపించుకున్న యువనేత !


" తెలంగాణ" పేరుతో ఆంధ్రలో పోటీ చేయగలరా ? 


టీఆర్ఎస్ అంటేనే  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. .భారతీయుల కోసం పార్టీ అయితే ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ... ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయపార్టీలకు ముఖ్యంగా ప్రాంతాన్ని తమ పేరులో పెట్టుకున్న పార్టీలకు అంత అవకాశం ఉండదు. భాషా ప్రాతిపదికన రాజకీయ పార్టీలు ఏర్పడినప్పుడు.. ఆ భాష మాట్లాడే రాష్ట్రాల్లో పోటీ చేసే చాన్స్ ఉంటుంది. జేడీఎస్, ఎన్సీపీ లాంటి పార్టీలు.. భాషా పార్టీలు కాదు. కానీ.. ఇతర ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయాయి.  ఎస్పీ, బీఎస్పీ లాంటివి యూపీలోనే ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి ఉండదు. ఇక తృణమూల్ కాంగ్రెస్.. బెంగాల్‌లో మాత్రమే ఉంది. అకాలీదళ్ పంజాబ్ దాటి రాలేకపోయింది. అందుకే... ఈ పార్టీల తీరును పరిశీలిస్తే... టీఆర్ఎస్‌ ఏపీలో పోటీ చేస్తుందని కానీ ఆ దిశగా కేసీార్ ఆలోచిస్తారని ఎవరూ అనుకోవడంలేదు.


Also Read : సీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.... అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్.. ప్లీనరీలో మంత్రి కేటీఆర్ కామెంట్స్
 
 2019లో అభ్యర్థుల్ని సైతం ఖరారు చేసుకున్నారన్న ఉహాగానాలు !


2018లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుకు అంగీకరించారు. మొత్తంగా తానే లీడ్ తీసుకుని కూటమిని నడిపించారు. కానీ  విఫలమయ్యారు. ఈ ఆగ్రహంతో టీఆర్ఎస్ నేతలు ఏపీ రాజకీయాల్లో తామూ వేలు పెడతామని ప్రకటించారు. ముఖ్యంగా కేటీఆర్ 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయాలని సంకల్పించినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొంత మంది అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారని అంటున్నారు. రిపబ్లిక్ డే సందర్శంగా రాజ్‌భవన్‌లో అప్పటి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందు సందర్భంగా అనేక మంది ఆంధ్రా ప్రాంతా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఎక్కువగా హైదరాబాద్‌లో స్థిరపడినవారే. విశాఖపట్నంకు చెందిన సన్యాసిరావు అనే వ్యాపారవేత్తను ఆ ఎట్‌హోంలోనే ఏపీలో టీఆర్‌ఎస్‌ టికెట్‌తో పోటీ చేయమని ఆఫర్ ఇచ్చేశారు. మీడియా ముందుగానే ఈ ఆఫర్ ఇచ్చారు.  అయితే తర్వాత పరిస్థితులు మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో పోటీ నుంచి విరమించుకుని పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి టీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఓ అంచనాకు రాజకీయవర్గాలు వచ్చాయి.


Also Read: ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..


ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో పోటీ చేసిన టీఆర్ఎస్ ! 
   
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తామని చెబుతున్నారు కానీ గతంలో పోటీ చేశారు కూడా. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసింది. ఇరవై నుంచి ముఫ్పై స్థానాల్లో నామినే,న్లు వేసింది. అయితే సీరియస్‌గా పోటీ చేయడానికి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే  అత్యధిక స్థానాల్లో పోటీ చేసి ఉండాలి. ఈ కారణంగా  పార్టీ పెట్టిన మొదట్లో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే ఎక్కువ చోట్ల పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్ కొన్ని చోట్ల నామినేషన్లు వేసింది. అయితే.. అప్పడు కనీస మాత్రం ఓట్లు కూడా రాలేదు.


Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !


ఆషామాషీగా కేసీఆర్ వాఖ్యలు చేస్తారా !?


ఎలా చూసినా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్తి పుణ్యానే ప్రకటనలు చేయరు. ఏదో రాజకీయ వ్యూహం ఉండే ఉంటుంది. ఏపీలో పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్‌కు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అక్కడ టీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల అక్కడి ఇతర పార్టీల్లో ఏదో ఒక దానికి ప్రయోజనం ఉంటుంది. సెంటిమెంట్ పెరిగి.. టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉండే పార్టీకి ఇబ్బందికరం అవుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ రాజకీయాలు చేసింది. టీఆర్ఎస్ మంత్రులు నేరుగా ఏపీకి వెళ్లి రాజకీయ ప్రకటనలు చేశారు. అయితే కేసీఆర్ ఏపీలో పోటీ చేసినా చేయకపోయినా ఆయన వ్యాఖ్యల వెనుక ఓ రాజకీయం ఉంటుందని.. అదేమిటన్నది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. 


Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి