ప్రజా ప్రస్థాన యాత్ర పేరుతో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల తళుక్కున మెరిశారు. తెలంగాణలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పేరుతో తాను పాదయాత్ర చేస్తున్నట్లుగా షర్మిల గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పాదయాత్ర సాగుతోంది. 


ఇందులో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అయిన శ్యామల తన పాల్గొన్నారు. తన భర్తతో కలిసి యాంకర్ శ్యామల పాదయాత్రలో వైఎస్ షర్మిలతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. ‘సమాజంలో మార్పు తెచ్చేందుకు షర్మిల అక్క చేపట్టిన పాదయాత్రలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. నేను వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానిని అని.. ఈ కారణంగానే షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చినట్లు శ్యామల స్పష్టం చేశారు.


Also Read:  Cyberabad traffic police: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా?!


అంతేకాక, వైఎస్ షర్మిల తలచుకుంటే ఎంతో గొప్పగా బతకవచ్చని.. కానీ, ఆమె ఇలా సాధారణంగా ఉండడం మంచి విషయమని అన్నారు. ‘‘ఒకవైపు మహానేత కుమార్తె, మరోవైపు సీఎంకు సోదరి అయిన షర్మిలక్క సంతోషంగా జీవించొచ్చు. కానీ ఆమె తన నాన్న గారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు కొనసాగుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం’’ అని యాంకర్ శ్యామల చెప్పారు.


Also Read: హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలన్నాం.. ఇలా కవర్ నే హెల్మెట్ లా వాడమనలేదు


బుధవారంతో వైఎస్ షర్మిల పాదయాత్ర 8 రోజులకు చేరుకుంది. గురువారం తొమ్మిదో రోజు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె యాత్ర 400 రోజులు కొనసాగుతుంది. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది.


ఎన్నికల వేళ వైఎస్ఆర్ సీపీలోకి..
షర్మిల కొత్త పార్టీ స్థాపించడానికి ముందేయాంకర్ శ్యామల ఆమెతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పాదయాత్రలో షర్మిలకు తోడుగా అడుగుకలిపారు. కాగా షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త నరసింహా ఇద్దరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. అప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.


Also Read:   Cyberabad Police: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..






Also Read: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి