ట్రాఫిక్ పోలీసులు.. పగలే.. ఉంటారు.. రాత్రైతే.. రోడ్లపైన బైక్ ఎలా నడిపినా.. ఏం చేసినా.. ఏం కాదు అనుకుంటున్నారా? అయితే మీరు మీ జేబులో చేయి పెట్టి డబ్బులు బయటకు తీయల్సిందే. చలాన్లు కచ్చితంగా పడతాయండి. రాత్రైతే ట్రాఫిక్ పోలీసులు ఉండరులేనని ఎక్కడ పడితే.. అక్కడ బైక్ పెట్టారో అంతే.. సంగతులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టింగ్ చేసిన వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది.



ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై సాధారణంగా జరిమానాలు వేయడం మనం చూస్తూనే ఉన్నాం. పగటి వేళల్లో ఇవి ఎక్కువ. అయితే అర్ధరాత్రి సమయంలో ఎవరుంటారు. ఏం చేసినా ఏమవుద్దిలేనని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు వాహనం పెట్టేవారికి.. ఓ వీడియో షాకింగ్ గానే అనిపిస్తుంది. సీసీ కెమెరాలో చూస్తూ.. ఉన్న పోలీసుల హెచ్చరికతో మైండ్ బ్లాంక్ అయిపోయింది.


 
ఇదేందయ్యా... ఇదీ ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా.. అనుకుంటూ ఓ వ్యక్తి వెళ్లిపోతున్న వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. నడిరోడ్డుపై వాహనం ఆపి ఫొటో తీసుకోవాలనుకునేవారికి.. అసలు విషయం అర్థమవుతుంది.రాత్రి సమయాల్లో పోలీసులు అంతగా పట్టించుకోరులే అనుకుంటూ.. దూసుకుపోతుంటారు. అలా చేస్తే మీ జేబుకు చిల్లు పడినట్లే. చలాన్ కచ్చితంగా పడుతుంది. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు 24 గంటలూ మీరు వాహనంపై చేసే.. ప్రతి కదలికను రెప్పవేయకుండా గమనిస్తుంటాయి. 



మాదాపూర్​లో నిర్మించిన తీగల వంతెనపై వాహనాలు ఆపి ఫోటోలు దిగడం నిషేధం. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి.. తన బైక్ ను.. వంతెనపై ఆపి స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాలని ట్రై చేశాడు. వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానం చేసి ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు వంతెన పై వాహనాలు ఆపొద్దు.. అక్కడినుంచి వెళ్లిపోండని మైకులో హెచ్చరించారు.



వామ్మో ఇదేందిరా.. నాయనా అనుకుంటూ... ఆ వాహనదారుడు ఈ ఫోటోలు వద్దు ఏమీ వద్దు.. చలానా వేయకండి వెళ్లిపోతున్నా అంటూ రన్ చేశాడు. ఆ వీడియోను సైబరాబాద్​ ట్రాఫిక్ ​పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు. ఎలాంటి చలాన్​ విధించలేదు. ఇకపై మీరూ బైక్ మీద వెళ్లేప్పుడు.. జాగ్రత్తగా వెళ్లండి రాత్రైనా.. ఏ సమయమైనా.. సరే.. జాగ్రత్తగా ఉండటం మంచిది. పొరబాటున పోలీసుల దగ్గర మీస్ అయినా.. సీసీ కెమెరాలు చూసుకుంటాయి. ఎక్కడో ఓ దగ్గర బుక్ అయిపోతారు. బండి నడపడమే కాదు.. రోడ్డుపై పెట్టి పక్కకు వెళ్లి వద్దాం అనుకున్నా ప్రమాదమే. ఇతరులకు ఇబ్బందులే ఎదురవుతాయి.