నికోల్ కిడ్ మన్ - టామ్ క్రూజ్, బిల్ గేట్స్ - మిళిందా గేట్స్, బ్రాడ్ పిట్ - ఏంజలీనా జోలీ... విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను చూపించడం ద్వారా తమ కాన్సెప్ట్ ఏంటో చెప్పారు 'మళ్లీ మొదలైంది' దర్శక నిర్మాతలు టీజీ కీర్తి కుమార్, కె. రాజశేఖర్ రెడ్డి. కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ముగిస్తే... కొన్ని పెళ్లిళ్లు విడాకులతో మొదలవుతాయని ముందే వివరించారు. సుమంత్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు (గురువారం) విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్ ట్వీట్ చేశారు. సూటిగా, సుత్తి లేకుండా స్ట్రెయిట్ గా సినిమాలో పాయింట్ చెప్పేశారు. కథేంటో రివీల్ చేశారు.






సుమంత్, వర్షిణీ సౌందర్ రాజన్ భార్యా భర్తలు. కలిసి ఉండలేకపోయారు. కాబట్టి విడిపోయారు. అయితే... 'మళ్లీ మొదలైంది' వాళ్లిద్దరి కథ కాదు. విడాకుల తర్వాత ప్రేమలో పడిన యువకుడి కథ. తన భార్య తరఫున విడాకుల కేసు వాదించిన లాయర్ నైనా గంగూలీతో సుమంత్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. నైనాతో సుమంత్ ఎన్ని కష్టాలు పడ్డాడు? 'మళ్లీ మొదలైంది' అని ఎందుకు కూలబడ్డాడు? అనేది కథ. 

Also Read: ఓ యాడ్ కోసం ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసిన స్టార్ హీరో, లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..


విడాకులు, మళ్లీ ప్రేమలో పడటం అంటే ఏదో సీరియస్ ఇష్యూలా కాకుండా వినోదాత్మకంగా చెప్పారు. 'శారదమ్మగారి మనవడికి విడాకులు అయిపోయిందంటమ్మా! ఇంకా చూస్తూ నేను ఎలా బతుకుండేదామ్మా!' అంటూ బామ్మ వయసున్న మహిళలు ఏడుస్తుంటే... 'అయితే చచ్చిపోండి' అని సుమంత్ అనడంతో బామ్మలు నోరెళ్లబెట్టారు.  'ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా దొంగ సచ్చినోడా' అని సొంత మనవడిని అన్నపూర్ణమ్మ తిట్టడం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. భార్యను చులకనగా చూడకూడదని సినిమాలో చివర్లో సందేశం కూడా ఇచ్చినట్టు ఉన్నారు.


సుమంత్ హీరోగా... నైనా గంగూలీ, వర్షిణీ సౌందర్ రాజన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితర  హాస్యనటులు కామెడీ బాధ్యత భుజాన వేసుకున్నారు. ముఖ్యంగా న్యాయమూర్తి పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ మంచి వినోదం పండించినట్టు ఉన్నారు. ట్రైలర్ ఎండింగ్ లో 'నిను వీడని నీడను నేనే' అంటూ పృథ్వీ చెప్పిన డైలాగ్ బావుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

Also Read:సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి