స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎవరి గుర్తుపై వారు పోటీ చేసినా ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు. కానీ ఇప్పుడా త్యాగాలకు టైమ్ దగ్గరపడినట్టు కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారం కోర్టులో ఉండటంతో  నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇప్పుడా కేసు ఓ కొలిక్కి రావడంతో కార్పొరేషన్లో ఎన్నికల హంగామా మొదలైంది. అయితే ఇక్కడ జనసేన-బీజేపీ కూటమి కలసి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 


నెల్లూరు నగర కార్పొరేషన్లోని 54 డివిజన్లలో జనసేన తన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఔత్సాహికుల వద్ద దరఖాస్తులు స్వీకరించారు. కొంతమందికి టికెట్లు ఖరారు చేయడంతో వారు ప్రచార పర్వంలోకి కూడా దిగేశారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి.. అభ్యర్థులను ప్రచార రంగంలోకి దింపారు. మొత్తం 54 డివిజన్లలో జనసేన పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. 
జనసేన 54 డివిజన్లలో పోటీ చేస్తే మరి బీజేపీ సంగతేంటి.. ఆ విషయంపై మాత్రం జనసేన వర్గాలు సైలెంట్ గా ఉంటున్నాయి. మరోవైపు బీజేపీ కూడా జనసేన నిర్ణయంతో షాకైంది. ప్రస్తుతం బద్వేల్ హడావుడిలో ఉన్నామని, ఆ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టిపెడతామని అంటున్నారు బీజేపీ నేతలు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బోణీ కొట్టిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. నెల్లూరు జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు సర్పంచ్ స్థానాలను జనసేన కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలు కూడా జనసేన ఖాతాలో పడ్డాయి. జనసేనకు వచ్చిన ఓట్లతో పోల్చి చూస్తే బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో సహజంగానే జనసేన నాయకులు సొంతంగా బరిలో దిగి తమ సత్తా చూపించాలని అనుకుంటున్నారు. పొత్తులతో ఇప్పటికే చాలా నష్టపోయామనే భావన వారిలో ఉంది. దీనికి తోడు అధిష్టానం కూడా ఒంటరిపోరుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నెల్లూరు కార్పొరేషన్లో జనసేన అన్ని డివిజన్లలోనూ అభ్యర్థుల్ని బరిలో దింపుతోంది.


Also Read: Jagan Illegal Assets Case: సీఎం జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ


Also Read: Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు.. విడిపోతే ఏపీ చీకట్లోకి వెళ్లిపోతుందని చెప్పామన్న సజ్జల !


Also Read:   Cyberabad Police: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..


Also Read:  Cyberabad traffic police: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా?!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి