ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని కొన్ని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే పార్టీ పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజలు అడిగినా పార్టీ పెట్టొచ్చు.. అడక్కపోయినా పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని అన్నారని.. కానీ ఇప్పుడు ఏపీలో చీకట్లు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఏనాడూ వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ అంధకారం అనలేదని కానీ .. విడిపోతే ఆంధ్రా అంధకారం అవుతుందని చెప్పామని గుర్తు చేశారు. 


Also Read : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !


ప్లీనరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ చేసిన విమర్శలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇవ్వలేదు. వీలైనంత సాఫ్ట్‌గా స్పందించే ప్రయత్నం చేశారు. ఏపీలో చీకట్లు ఉన్నాయని.. విద్యుత్ కోతలు అమలవుతున్నాయని విపక్ష నేతలు విమర్శలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గతంలో ఖండించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అదే తరహా ప్రకటన చేస్తే ఖండించలేదు. రాజకీయంగానే సమాధానం చెప్పారు. విడిపోవడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పారు. 


Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?


పథకాల అంశంలో పెద్దగా స్పందించలేదు. తెలంగాణతో పోలిస్తే తామే పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేసీఆర్ ప్రకటనపై స్పందించారు. ఆ తర్వాత ఇంకెవరూ స్పందించలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అనవసరంగా ఎవరూ స్పందించి భారీ ప్రాధాన్యత కల్పించవద్దని ముందుగానే వైసీపీ హైకమాండ్ తమ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. 


Also Read : ఏపీ నార్కొటిక్స్ హబ్ గా మారింది.. నల్గొండ ఎస్పీ కూడా అదే చెప్పారు


గత ఎన్నికలకు ముందు నుంచీ టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు పార్టీల ఎంపీలు కలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చని.. ఏపీ, తెలంగాణలకు కావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చని గతంలో చెప్పారు. అయిత ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తూండటం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. 


Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి