బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం కూడా ముగిసింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బరిలో లేకపోవడంతో వార్ వన్ సైడ్ అవడం ఖాయమయింది. అయితే తమ ప్రభావం చూపించాలని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ కారణంగా పోటీ అనివార్యమయింది. టీడీపీ పోటీలో లేకపోయినప్పటికీ వైసీపీ ఎన్నికను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. లక్షకుపైగా మెజార్టీ సాధించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేలులోనే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపించారు.


Also Read : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !


లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్‌గా వైఎస్ఆర్‌సీపీ ప్రచారం !
బద్వేలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీకి ఫలితం మీద ఎలాంటి డౌట్ లేదు. కానీ మెజార్టీని లక్షకు తీసుకెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేకంగా మండలానికో ఇంచార్జ్‌ను నియమించి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ స్థాయిలో ప్రచారం చేయనప్పటికీ ఇంటింటి ప్రచారం ఎక్కువగా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఓటర్లందరికీ లేఖలు రాశారు. వాటిని వైసీపీ కార్యకర్తలు .. వాలంటీర్లు ఇంటింటికి పంపిణీ చేసి ఓటు వేయాలని కోరారు. 




Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?


మెరుగుపడ్డామని చాటి చెప్పడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నం !
ఇక భారతీయ జనతా పార్టీ ఈ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి ఓట్లన్నింటినీ గుంపగుత్తగా కమలం పార్టీ గుర్తుపై పడేలా చేసుకుని.. తమ పార్టీ మెరుగుపడిందని చెప్పుకోవాలనుకుంటున్న బీజేపీ .. సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతలందర్నీ బద్వేలులో మోహరించారు. జాతీయ పదవులు ఉన్న పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ కూడా వచ్చి ప్రచారం చేశారు.  బద్వేలులో బీజేపీని గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరించేస్తామని చెబుతున్నారు. బీజేపీ నేతలు తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని ఏ మాత్రం వదిలి పెట్టడం లేదు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. అభ్యర్థిగా గత ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి పోటీ చేసిన పనతల సురేష్‌ను నిలబెట్టారు. ఆయన స్థానికుడు కాకపోవడం.. పెద్దగా వ్యక్తిగత బలం లేకపోవడం.. బీజేపీకి క్యాడర్ లేకపోవడం మైనస్‌గా మారింది.


Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !


పాత ఓటు బ్యాంక్‌పై ఆశతో కాంగ్రెస్ !
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా నిలబెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ బద్వేలులో అజేయంగా ఉండేది. కానీ తర్వాత క్యాడర్ అంతా వైఎస్ఆర్‌సీపీలో చేరిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం కూడా కష్టమే. అయితే బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తోంది. ఆ పార్టీలో మిగిలిన ఉన్న కొంత మంది సీనియర్లు తమ ప్రయత్న లోపం లేకుండా ప్రచారం చేశారు.  


Also Read : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి