తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుంచి నోటీసులు అందాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఉంది. సంతృప్తికర సమాధానం ఇవ్వకపోయినా.. నోటీసులకు సమాధానం ఇవ్వకపోయినా ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సహకార చట్టంలోని 6 A కింద .. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌ లాల్ ఈ నోటీసులను జారీ చేశారు.


Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !


అయితే ధూళిపాళ్ల ట్రస్ట్‌కు దేవాదాయశాఖ తరపున నోటీసులు జారీ కావడం ఇదే మొదటి సారి కాదు. ఆగస్టు 19వ తేదీన కూడా ఓ సారి నోటీసులు జారీ చేశారు. అప్పట్లో దేవదాయ శాఖ జేసీ,  శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. అయితే అప్పట్లో ఆ నోటీసును చేతికి కూడా అందించకుండా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆస్పత్రి గోడపై అతికించి వెళ్లారు. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ నోటీసుల్లో పేర్కొంది.  ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.


Also Read : గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు


ఆ నోటీసులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న నరేంద్ర స్పందించారో లేదో స్పష్టత లేదు. రెండు నెలల తర్వాత ఇప్పుడు  దేవాదాయ శాఖ కమిషనర్ పేరు మీదనే నోటీసులు జారీ అయ్యాయి.  సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. 1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. సంగం డెయిరీ రైతుల కోసం మరిన్ని కార్యక్రమాలను ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. 


Also read: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష


గతంలో సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసింది. కానీ ఆ  ఉత్తర‌్వులు హైకోర్టులో నిలువలేదు. అప్పుడు కూడా ప్రధానంగా ప్రభుత్వం ఈ ట్రస్ట్‌పైనే ఆరోపణలు చేసింది. డీవీసీ ట్రస్ట్ పేరుతో కట్టిన ఆస్పత్రి ఉన్న పది ఎకరాలు సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన స్థలం అని.. దాన్ని అలా ట్రస్ట్‌కు తీసుకోవడం చట్ట విరుద్ధమన్న కారణాన్ని  సంగం డెయిరీ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ట్రస్ట్ విషయంలో దేవాదాయశాఖకు సంబంధం ఏమిటన్నదానికి మిస్టరీగా మారింది.


Also Read: మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి