ఏపీలో డ్రగ్స్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు డ్రగ్స్ పై జనసేన అధినేత పవన్ కూడా విమర్శలు గుప్పించారు. ఏపీలో డ్రగ్స్ సరఫరాపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అనేక మంది డ్రగ్స్ లార్డ్లతో ఏపీ నిండిపోయిందని పవన్ ఆరోపించారు. దేశంపై ప్రభావం చూపుతుందని సమస్యను ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతున్నారని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందన్న..నల్లగొండ ఎస్పీ రంగనాథ్ వీడియోను పవన్ ట్విట్టర్లో పోస్టు చేసిశారు.
2018లో తాను నిర్వహించిన పోరాటయాత్ర సందర్భంగా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయికి సంబంధించి తనకు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ అంశాలతో పాటు గంజాయి దందా, గంజాయి మాఫియా పైనా ప్రజలు ఫిర్యాదు చేశారని పవన్ ట్వీట్ చేశారు.
ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని నల్గొండ ఎస్పీ కూడా అన్నారని పవన్ తెలిపారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను కూడా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ మాదకద్రవ్యాల అడ్డాగా మారిందని, ప్రతిస్థాయిలోనూ డ్రగ్స్ కింగులతో నిండిపోయిందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన పాలకులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడంతో యావత్ దేశం ప్రభావితమవుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
నార్కోటిక్స్ హబ్ ఆఫ్ ది నేషన్ పూణే, ముంబయి, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు కూడా గంజాయిని ఏపీనే సరఫరా చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.