రాష్ట్రంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష  చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నియామకాల్లో పక్షపాతాలకు లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రభుత్వం ఇప్పటికే అనుమతి తెలిపింది. బోధన సిబ్బందిలో నాణ్యతతో పాటు ఉన్నత ప్రమాణాలు ఉండేలా నియామకం ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వర్సిటీలు సమన్వయం కావాలని సూచించారు. వర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ తోడ్పాటుపై వీసీలతో చర్చించాలన్నారు. ప్రతివారం ఒక్కో వీసీతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.


Also Read: కాకినాడ మేయర్ గా సుంకర ప్రసన్న ఎన్నిక.... వైసీపీ కండువాలతో హాజరైన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు


ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు


 నాణ్యమైన విద్యతో ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం జగన్ అన్నారు. వర్శిటీల్లో బోధన సిబ్బంది నియామకానికి అనుమతులు ఇచ్చామని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోర్సులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంగ్లం తప్పనిసరి పాఠ్యాంశం ఉండాలన్నారు. ఆంగ్లం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి మారేవారికి అనువుగా ఉండేందుకు ఆంగ్లం, తెలుగు భాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం ఏమీ లేదన్నారు. ప్రభుత్వానికి అప్పగించడంపై పూర్తి స్వేచ్ఛ యాజమాన్యాలకు ఉందన్నారు. ఇది స్వచ్ఛందమని స్పష్టం చేశారు. చాలా విద్యాసంస్థల్లో సమస్యలు ఉన్నాయన్న సీఎం.. ప్రభుత్వానికి అప్పగిస్తే స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. స్వచ్ఛందంగా నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 


Also Read: ఆర్టీసీలో ఇకపై డొక్కు బస్సులే ఉండవు.. పనులు ఊపందుకున్నాయి


సకాలంలో ఫీజు రియింబర్స్ మెంట్ అందజేస్తున్నాం 


జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి యూనివర్శిటీ పరిధిలో జాతీయ ప్రమాణాలు ఉండాలన్నారు. కాలేజీలన్నీ కూడా జాతీయ ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఎటువంటి లోటు చేయడంలేదన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నామన్నారు. తల్లుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నామని స్పష్టం చేశారు. యూనివర్శిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజురియింబర్స్‌మెంట్‌ ఫీజులు అందిస్తున్నామన్నారు.

 


Also Read: ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి