ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పేరూరు సమీపంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ రోజు (అక్టోబరు 25) తెల్లవారు జామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఏకే 47 ఆయుధాలను సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఈ మావోల్లో ఓ అగ్రనేత ఉన్నారని భావిస్తున్నారు.
Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
ములుగు- బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రే హౌండ్స్ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ధ్రువీకరించారు. పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాళ్లగూడెం, టేకులగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు ఏఎస్పీ గౌస్ అలం తెలిపారు.
మృతిచెందిన ముగ్గురిలో తొలుత ఇద్దరు మావోయిస్టులను గుర్తించారు. వారిని బద్రు అలియాస్ కల్లు అనే వ్యక్తిని ఛత్తీస్‌ఘడ్‌లోని దక్షిణ బస్తర్ డివిజన్ మావోయిస్టు నేతగా గుర్తించారు. మరో వ్యక్తిని మహారాష్ట్ర గడ్చిరోలి డివిజన్ మావోయిస్టు నేత కమ్మగా గుర్తించారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
అది బూటకపు ఎన్‌కౌంటర్: సీపీఐ మావోయిస్టు పార్టీ
ములుగు జిల్లా టేకుల గూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి తమ ప్రభుత్వం గొప్పగా చేసిందని చెప్పుకుంటుందని అన్నారు. తెలంగాణ అడవుల్లో నెత్తురోడిస్తూనే మరోపక్క కల్లబొల్లి మాటలతో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ లేఖలో తెలిపారు.