బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న ఇంటి సభ్యులు ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టారు. ఒక్కో వారం ఒక్కో స్టైల్లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కూడా విభిన్నంగా జరిగింది. ఈ సారి లేఖలతో నామినేషన్ డిసైడ్ చేశారు బిగ్ బాస్.
ప్రోమోలో ఏముందంటే 'మీకు ప్రియమైన వారినుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుంది. కానీ జీవితంలో మనం కోరుకున్న అన్నీ దక్కవు. కొన్ని దక్కాలంటే దానికి బదులుగా ఏదైనా వదులుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే పవర్ రూమ్ లో ఉన్న సభ్యులు లేఖలు ఇస్తారో వారు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారు'' అని చెప్పారు బిగ్ బాస్. రెండు వారాలుగా ఇంటి సభ్యుల్లో సగానికి పైగా నామినేషన్లలో ఉంటున్నారు. గడిచిన వారం 8 మంది, అంతకు ముందు వారం 10 మంది నామినేషన్లలో ఉన్నారు.
Also Read: మహేష్ బాబు మేనల్లుడి కోసం సిద్ శ్రీరామ్ పాడిన 'అచ్చ తెలుగందమే'..
ఇప్పటి వరకూ సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేత, ప్రియ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఏడో వారం ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జరిగింది. లోబో, ఆనీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నారని వాళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయనే ప్రచారం జరిగింది. కానీ మొదట్నుంచీ మంచిగా ఆడుతున్న ప్రియ గడిచిన వారంలో విశ్వరూపం చూపించింది. చెంప పగలగొడతా అంటూ సన్నీని టార్గెట్ చేసిన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఓ దశలో గతసీజన్లో తమన్నా సింహాద్రిలో పోల్చారు. దీంతో ఆఖరి నిముషంలో ఆనీ మాస్టర్ ప్లేస్ లో ప్రియ ఎలిమినేట్ అయిందంటున్నారు. మరి ఈ వారం నామినేషన్లలో ఉండేదెవరు...వీకెండ్ లో ఎలిమినేట్ అయ్యేదెవరో వెయిట్ అండ్ సీ...
Also Read: అక్కాయ్... తమిళంలో కూడా అలా రోల్ అవుతుంటాయా?
Also Read: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత
Also Read: ట్రావెలింగ్‌తో రిలాక్స్ అయ్యేందుకు సమంత ప్రయత్నం!
Also Read: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో..
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి