ప్రముఖ సినీ నటుడు రాజబాబు(64) కన్ను మూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించిన చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజబాబు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. పలువురు సినీ ప్రముఖులు.. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. సినిమాల్లో కంటే.. ఆయన సిరియల్స్ లోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు. మృధుస్వభావిగా రాజబాబుకు పేరింది.


తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్‌ 13న రాజబాబు జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు నాటకలు అంటే చాలా ఇష్టం. ఎంతో ఆసక్తితో నాటకలు వేసేవారు. ఎన్నో నాటకలు వేశారు. ఇండస్ట్రీకి రావాలని కలలు కన్నారు.  అందులో భాగంగానే.. 1995లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబు సినిమాల్లోకి వచ్చారు. కృష్ణవంశీ తెరెకెక్కించిన చాలా సినిమాల్లో ఉన్నారు. సింధూరం, సముద్రం, మురారి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. శర్వానంద్ శ్రీకారం.. మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. సుమారు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు రాజబాబు.


పలు సీరియల్లలోనూ రాజబాబు నటించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ స్రవంతి తదితర ధారావాహికల్లో ఆయన నటనతో మెప్పించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని నటనకు గానూ ఆయనకు నంది అవార్డు కూడా దక్కింది. నిజ జీవితంలో రాజబాబు చాలా సరదా మనిషి చెబుతుంటారు సన్నిహితులు. అలాంటి వ్యక్తి కన్ను మూయడంతో తోటి నటులు ఆవేదనలో ఉన్నారు. తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయనను అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.


Also Read: Manchu Vishnu: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో.. 


Also Read: Tollywood: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?


Also Read: F3 Movie Release Date: 'ఎఫ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్... బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే నవ్వుల పండగ!


Also Read: Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..


Also Read: Chiranjeevi: తన వీరాభిమానికి కొండంత అండగా మెగాస్టార్... సొంతఖర్చుతో చికిత్స