చిరంజీవి కోసం ప్రాణాలిచ్చే వీరాభిమానులున్నారు. చిరంజీవి కూడా తనకు అభిమానులే దేవుళ్లతో సమానమని తరచూ అంటుంటారు. అలాంటి తన వీరాభిమానికి అనారోగ్యంగా ఉందని తెలిసి చిరు చాలా ఉదారంగా ప్రవర్తించారు. చిరు చేసిన పని ఆయన అభిమానుల గుండెల్ని తాకింది. అసలేమైందంటే విశాఖపట్నానికి చెందిన వెంకట్ చిరుకు వీరాభిమాని. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలనుకుంటున్నట్టు అభ్యర్థించారు. ఆ ట్వీట్ లో తన ఆరోగ్యం బాగోలేదని, చిరంజీవిని కలవాలనుకుంటున్నట్టు కోరారు. విషయం చిరు వరకు చేరింది. అభిమాని అభ్యర్థనను వెంటనే ఒప్పుకున్నారు మనసున్న మెగాస్టార్. అతని గురించి వాకబు చేసి, తనను కలవాల్సిందిగా కోరారు.
వెంకట్ ఆరోగ్యం అంతగా బాగోకపోవడంతో జర్నీ చేయలేని పరిస్థితి నెలకొంది. విషయం అర్థం చేసుకున్న చిరంజీవి తన సొంతఖర్చుతో వెంకట్, అతని భార్యకి విమాన టికెట్లు తీసి హైదరాబాద్ కు రప్పించారు. శనివారం వారిద్దరినీ తన ఇంటికి పిలిచి దాదాపు ముప్పావుగంట సేపు మాట్లాడారు. అన్నీ విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. హైదరాబాద్ లోని ఒమేగా హాస్పిటల్స్ కు చెకప్ కోసం పంపించారు. అక్కడి వైద్యులతో తానే స్వయంగా మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో చర్చింది వెంకట్ సొంత నగరమైన విశాఖపట్నంలోనే అతనికి వైద్యం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై విశాఖలోని ఆసుపత్రిలో చేర్చే విషయమై చర్చించారు కూడా. అక్కడ అతని చికిత్స అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చిరు హామీ ఇచ్చారు. అవసరమైతే చెన్నై ఆసుపత్రికి కూడా తరలించి వైద్యం చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన వీరాభిమాని వెంకట్ కు హామీ ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులంతా తమ హీరో మంచి మనసును మెచ్చుకుంటున్నారు.
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
Also read: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... గిన్నెలు తోమే విమ్ సబ్బు పంపించారు, అక్కడే మరో ట్విస్టు కూడా
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి