ఐసీసీ టీ20 ప్రపంచకప్ 15వ మ్యాచులో షార్జా వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు అర్హత మ్యాచులాడి సూపర్-12కు చేరుకున్నాయి. ఒకప్పుడు ప్రపంచకప్ గెలిచిన లంకేయులు ఇప్పుడు డీలాపడ్డారు. బంగ్లా పులులు ఇప్పటికీ అండర్ డాగ్‌గానే బరిలోకి దిగుతున్నాయి.
లంకేయులదే పైచేయి
పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై లంకేయులదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 11 సార్లు పోటీపడగా బంగ్లా కేవలం నాలుగు సార్లే గెలిచింది. 2018 మార్చి తర్వాత ఒకర్నొకరు ఎదుర్కోలేదు. ఆఖరిసారి తలపడ్డ ఐదుసార్లు బంగ్లా మూడుసార్లు గెలిచింది. ఈ ప్రపంచకప్ ఫస్ట్‌రౌండ్లో లంకేయులు మూడుకు మూడూ గెలవగా.. బంగ్లా మూడింట్లో రెండు మ్యాచులు గెలిచింది.
ఫేవరెట్ శ్రీలంక
ఈ మ్యాచులో లంకేయులే కాస్త ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు. ఎందుకంటే వారు వరుసగా మూడు మ్యాచులు గెలిచిన జోరుతో ఉన్నారు. అయితే బంగ్లాను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఇబ్బంది పడటం ఖాయం. లంకలో కుశాల్ పెరీరా, వనిందు హసరంగా కీలకంగా ఉన్నారు. పెరీరా చివరి ఆరు మ్యాచుల్లో 116 పరుగులు చేశాడు. హసరంగ 10 మ్యాచుల్లో 109 పరుగులు చేశాడు. ఇక బంతితోనూ 16 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్పిన్ ప్రత్యర్థులకు ఇబ్బందికరమే. లంకలో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లే ఉన్నారు.
భీకరమైన ఫామ్‌లో..
బంగ్లా కూడా జోరు మీదే ఉంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో మహ్మదుల్లా, హమ్మద్ నయీమ్ కీలకం అవుతారు. మహ్మదుల్లా తాను ఆడిన ఆఖరి పది మ్యాచుల్లో 229 పరుగులు చేయగా నయీమ్ 9 మ్యాచుల్లోనే 220 కొట్టాడు. ఇక బౌలింగ్‌లో షకిబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్‌కు తిరుగులేదు. వీరిద్దరూ ఆడిని ఆఖరి తొమ్మిది మ్యాచుల్లో వరుసగా 17, 16 వికెట్లు తీశారు. పైగా ఐపీఎల్‌లో అదరగొట్టారు. యూఏఈ పిచ్‌లపై వికెట్లు తీశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముస్తాఫిజుర్‌ను ఎదుర్కోవడం కష్టం.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ