పాకిస్థాన్ తరహాలో భారత్ ఎప్పుడూ సంచలన, భారీ ప్రకటనలు చేయదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దాయాదితో మ్యాచులకు సంపూర్ణంగా సన్నద్ధమవుతుందని పేర్కొన్నాడు. వారితో పొలిస్తే భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న భారత్, పాక్ తలపడుతున్న నేపథ్యంలో వీరూ మాట్లాడాడు. పాక్‌పై భారత ఆధిపత్యానికి కారణాలను వివరించాడు.
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
'2003, 20211 ప్రపంచకప్‌ల గురించి మాట్లాడాలంటే అప్పుడు మాపై ఒత్తిడి అంతగా లేదు. ఎందుకంటే మేం టోర్నీలో పాక్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాం. మేం అలాంటి వైఖరితో ఆడతాం కాబట్టే విజయాలు అందుకుంటాం. పాక్‌లా మేమెప్పుడూ భారీ, సంచలన ప్రకటనలు ఇవ్వలేదు. పాక్‌లో మాత్రం విపరీతంగా సవాళ్లు చేస్తుంటారు. భారీ డైలాగులు పేలుస్తుంటారు' అని వీరూ అన్నాడు.
Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్
'మేం వారిలా ప్రకటనలు ఇవ్వం. టీమ్‌ఇండియా మాటలు కాకుండా మెరుగ్గా సన్నద్ధం అవుతుంది. మ్యాచులో ఎలా ఆడాలో ప్రణాళికలు రచించుకుంటుంది. అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే' అని వీరూ ఏబీపీ న్యూస్‌కు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20ల్లో భారత్‌ను పాక్ ఓడించగలదని అతడు వివరించాడు.
Also Read: గబ్బర్ అవతారమెత్తిన కింగ్.. నీలో మంచి నటుడున్నాడయ్యా అంటున్న నెటిజన్లు!
'ఈ ఫార్మాట్ ప్రకారం చూస్తే పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వారు వన్డేల్లో కన్నా టీ20ల్లో కాస్త బాగానే ఆడతారు. బాబర్ ఆజామ్, ఫకర్ జమాన్, రిజ్వాన్, షాహిన్ అఫ్రిది వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఈ పార్మాట్లో ఎవరైనా ఒక్క ఆటగాడు ప్రత్యర్థి జట్టును ఓడించొచ్చు. ఇప్పటి వరకైతే పాకిస్థాన్ ఆ పని చేయలేకపోయింది' అని వీరూ తెలిపాడు.
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి